Anchor Suma : జూనియర్ ఎన్టీఆర్ మాటలకి వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన యాంకర్ సుమ

- Advertisement -

Anchor Suma : ఈమధ్యనే నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే..ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు..అయితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్లాస్ పీకడం, అక్కడ యాంకరింగ్ చేస్తున్న సుమ ని కోపం తో ఉరిమి చూడడం వంటివి ఇప్పుడు సోషల్ మీడియా గత కొద్దిరోజుల నుండి బాగా ట్రేండింగ్ టాపిక్ అయ్యింది..అసలు విషయానికి వస్తే #RRR చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా షూటింగ్ ని ప్రారంభించుకోలేదు.

Anchor Suma
Anchor Suma

కొరటాల శివ తో సినిమా చేయబోతున్నాడని తెలుసు కానీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. ఫ్యాన్స్ దీనిపై సోషల్ మీడియా లో చాలా అసహనం చూపించడం వంటివి మనం రోజూ చూస్తూనే ఉన్నాము. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ మొదలయ్యే ముందు సుమ #NTR30 అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు , ఇప్పుడు సమాధానం దొరకబోతుంది అని చెప్పడం తో ఎన్టీఆర్ సుమ వైపు చాలా కోపం గా ఉరిమి చూస్తాడు.

ఎన్టీఆర్ అలా చూడడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది.. సుమ అలా అనడం తో వాళ్ళు చెప్పకపోయినా నువ్వే చెప్పేసేలా ఉన్నావ్ అని అంటాడు, ఆ తర్వాత స్పీచ్ అయిపోయిన తర్వాత సుమ కి కూడా ఎన్టీఆర్ క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కి ఆరోజు తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చే ఆలోచనే లేదట.

- Advertisement -

కేవలం సుమ అలా అడగడం, అభిమానులు దానికోసం గోల పెట్టడం వల్లే ఆయన బలవంతంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇదే విషయాన్నీ ఎన్టీఆర్ స్టేజి దిగిన తర్వాత సుమ కి సీరియస్ టోన్ లో చెప్పడం తో ఆమె బాగా హర్ట్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నట్టు ఇండస్ట్రీ లో ఒక వార్త జోరుగా కొనసాగుతుంది. యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు. వీళ్ళ మధ్య అలాంటి అలకలు , కోపాలు అన్ని సహజమే కానీ , తన నోటి దూల వల్ల లీక్ జరిగిపోయిందే అని సుమ చాలా ఫీల్ అయ్యి ఏడ్చేసినట్టు తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com