బుల్లితెరపై సక్సెఫుల్ గా దూసుకుపోతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ సౌమ్య రావు ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది.. అతి కొద్ది రోజుల్లోనే బాగా పాపులర్ అయ్యింది.. తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంది.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తుంది.. అయితే అందమైన నవ్వు వెనుక చెప్పుకొలేని భాదలు కూడా ఉన్నాయని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఆమె తల్లి ఎంతో భయంకరమైన క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయిందట..అది ఆమె జీవితంలో మర్చిపోలేని భాధ అని సౌమ్య చెబుతుంది..

ఆమె తల్లి ఎంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొందో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. ఇక తాజాగా మదర్స్ డే సందర్భంగా తల్లిని తలుచుకుని.. ఆమెతో తీసుకున్న వీడియోలను షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది యాంకర్ సౌమ్యా రావు.. ఆమె చేసిన పోస్ట్ చూసి నేటిజన్లు ధైర్యం చెబుతూ కామెంట్స్ చెబుతున్నారు..మదర్స్ డే రోజు తల్లి తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది యాంకర్ సౌమ్యా రావు. మదర్స్ డే రోజు తన తల్లితో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఎమోషనల్ అయ్యింది. ఆమె ఆఖరి రోజుల్లో పడిన కష్టాలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది..
ఆమె తల్లి క్యాన్సర్ తో మృతి చెందింది..అమ్మంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది నాకు. అమ్మ కోసం నేను మొక్కని దేవుడు లేడు. వెళ్లని గుడి లేదు. అమ్మ ఆరోగ్యం కోసం ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నీ మీద, నా మీద కరుణ చూపించ లేదు. దేవుడు ఎందుకు ఇంత నిర్దయగా ప్రవర్తించాడు అని చాలా .. అందరు వాళ్ల అమ్మతో దిగిన ఫోటోలను షేర్ చేస్తే, నేను మాత్రం నీ భాధను తలచుకొని ఏడుస్తున్నా అంటూ పోస్ట్ చేసారు.. ఆ వీడియోలో చివరిరోజుల్లో తల్లితో గడిపిన వీడియో అని తెలుస్తుంది.. ఆ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..