Anchor Ravi : యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలాకాలం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో ఈ పేరు వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కువగా ఫిమేల్ యాంకర్స్ ఏ రాజ్యమేలేస్తున్న సమయంలో ..మేల్ యాంకర్స్ కూడా సత్తా చాటగలరని ప్రూఫ్ చేసిన యాంకర్ రవి. మేల్ యాంకర్స్ లో మనం చెప్పుకోదగ్గ యాంకర్లలో ముందున్న వ్యక్తి. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ అనే చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఫిమేల్ యాంకర్స్ . కాగా ఇటీవల సోషల్ మీడియాలో రవికి సంబంధించిన కొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . వాస్తవానికి రవి చాలా జోవియల్ గా ఉంటాడు .. ఏ షోకి కమిట్ అయినా సరే ఆ షో కి తగిన న్యాయం చేస్తాడు. జనాలను ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టమైనా పడుతాడు.
అయితే గతంలో యాంకర్ రవి మరొక యాంకర్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యాడంటూ ప్రచారం జరిగింది. ఆమె ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. అంతేకాకుండా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. యాంకర్ రవి కూడా ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. యాంకర్ రవి పెళ్లి చేసుకున్న విషయం చాలామందికి చాన్నాళ్ల వరకు తెలియకపోవడం గమనార్హం. కాగా తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. కొన్ని కారణాల చేత తన భార్య ఘోర అవమానాలు పడిందంటూ చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు .
వాళ్లు వెకేషన్ కి వెళ్లిన సందర్భంలో తన భార్యతో కొందరు అసభ్యకరంగా మాట్లాడారట . “అదేంటి అతను నీ భర్త అంటున్నావ్..? ఆమె ఫలానా యాంకర్ భర్త కదా..? వాళ్లిదరూ అంత చనువుగా ఉంటారంటూ వ్యంగంగా.. వెటకారంగా రవి భార్య బాగా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడారట”. నిజానికి ఏ భార్య కూడా తన భర్తను వేరే ఒక అమ్మాయి భర్తని చెబితే తట్టుకోలేదు. అది తన ముందుకే వచ్చి చెప్తే అసలు తట్టుకోలేరు. ఆ టైంలో రవి భార్య చాలా కుమిలిపోయిందట. కొందరు జనాలు అలా కావాలని బాధ పెట్టడానికే పుడతారంటూ అభిమానులు రవికి సపోర్టు ఇస్తున్నారు. సెలబ్రెటీస్ కి ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కోవడం సర్వసాధారణమేనంటూ మరికొందరు లైట్ గా తీసుకుంటున్నారు.