బుల్లితెరపై ప్రసారం అవుతున్న టీవీ షోలతో బాగా ఫెమస్ అయినవారిలో హాట్ యాంకర్ రష్మీ కూడా ఒకరు.. రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు… ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా వ్యవహారిస్తుంది.. అయితే మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో నిర్వహించారు. ఇందులో రష్మీ అడిగే ప్రశ్నలకు ఓపెన్ హార్ట్ తో సమాధానం చెప్పాలి అని చెప్పారు. ఈ విధంగా ఈమె పలువురు సెలబ్రిటీలను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది..

కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ సైతం యాంకర్ రష్మీని ప్రశ్నిస్తూ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించిన నువ్వు వెండితెరపై ఎందుకు సక్సెస్ సాధించలేకపోయావు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ… సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు వచ్చాయి. అయితే రాత్రికి రాత్రే నా పాత్రలో ఇతరులు వస్తున్నారని ఈమె తెలియజేశారు. ఇలా తాను ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయానని తెలిపారు.. ఇక సాధారణంగా ఇండస్ట్రీలో అందరికీ ఒక స్టాంపు ఉంటుంది. మరికొంతమంది వారు సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించగలరని పలువురు చెల్లెలు పాత్రలోనూ, మరికొందరు అక్క వదిన పాత్రలకు మాత్రమే సెట్ అవుతారనే స్టాంప్ వారిపై ఉంటుంది..

ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గెస్టులు వచ్చారు. జెస్సీ, మెహబూబ్, యాంకర్ స్రవంతి మొదలగువారు ఈ షోకు హాజరవడం జరిగింది. వీరిని పాయింట్ బ్లాక్ పెట్టి ప్రశ్నలు అడిగింది.. ముఖ్యంగా యాంకర్ స్రవంతి, బిగ్ బాస్ ఫెమ్ జేస్సి ని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది.. ముఖ్యంగా అమ్మాయిలతో నువ్వు అలా ఉంటావు కదా ఫ్లట్ చెయ్యడం నీకు అలవాటా.. వాడుకొని వదిలెయ్యడం నీకు సరదానా అంటూ గుచ్చి గుచ్చి దారుణమైన ప్రశ్నలను అడిగింది.. జేస్సి కూడా దానికి సీరియస్ అయ్యాడు.. మొత్తానికి జెస్సిని రష్మీ టార్గెట్ చేసినట్లు ఆ వీడియోలో చూపించారు.. ఈ షో వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.. దీన్ని చూసిన వారంతా ఛీ రష్మీ ఇలా అంటుందని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..