Anchor Pradeep : కోట్లు సంపాదిస్తున్న బుల్లితెర మేల్ యాంకర్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

- Advertisement -

Anchor Pradeep : బుల్లితెరలు హడావిడ అంతా యాంకర్లదే ఉంటుంది. చిన్న స్టేజ్ షో దగ్గర నుంచి సినిమా ఈవెంట్ల వరకు యాంకర్లు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చాలామంది యాంకర్లు ఉన్నప్పటికీ.. సుమ, ఉదయభాను, ప్రదీప్ మాచిరాజు.. ఇలా కొందరు పేర్లు మాత్రం మనకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. షో ఏదైనా సరే.. యాంకర్ గా, గెస్ట్ గా ,హోస్ట్ గా ఎలా వచ్చినా సరే…తనదైన బ్రాండ్ కామెడీ చేసి అందరిని ఓ రేంజ్ లో నవ్వించే వ్యక్తి ప్రదీప్.

Anchor Pradeep
Anchor Pradeep

ఫిమేల్ యాంకర్స్ లో సుమ హవా నడుస్తుంటే మేల్ యాంకర్స్ లో ప్రస్తుతం ప్రదీప్ మాచిరాజు బాగా ఫేమస్ అని చెప్పవచ్చు. కథ కొద్ది కాలంగా ప్రదీప్ పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్…అయితే ప్రస్తుతం అతని రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. రోజుకి ప్రదీప్ తీసుకుంటున్న రెండునరేషన్ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటున్నట్లు సమాచారం. అంటే నెలకు సుమారు ఇతని ఖాతాలో రెండు కోట్లు వస్తుందన్నమాట.

వీటితో పాటుగా అప్పుడప్పుడు సినిమాలు ,షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ , మరికొన్ని బ్రాండ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం వంటి వాటి ద్వారా మరింత సంపాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే కొన్ని వేల కోట్ల ఆస్తులను ప్రదీప్ వెనకేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ముందు చూపు బాగా ఉన్న ఈ 37 ఏళ్ల బ్రహ్మచారి ఎక్కువగా స్థిరాస్తుల మీదే ఫోకస్ పెడుతున్నాడు.ప్రదీప్ హోస్ట్ గా ఒకప్పుడు పెళ్లిచూపులు అనే షో కూడా వచ్చింది అంటే అతని పెళ్లి ఎంత హాట్ టాపికో ఆలోచించండి. అప్పట్లో ఒక అమ్మాయిని చూసి ప్రదీప్ ఇష్టపడ్డాడని పెళ్లి చేసుకోబోతున్నాడని మాటలు అయితే వచ్చాయి. కానీ అందరూ ఊహించినట్లుగా పెళ్లయితే జరగలేదు. అయితే ప్రస్తుతం వచ్చే సంవత్సరం మొదట్లో ప్రదీప్ పెళ్లి ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here