Anchor Anasuya : బుల్లితెరపై హాట్ యాంకర్స్ లో అనసూయ ఒకరు..యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నటిగా భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలకు పోజులిస్తుంది.. అవి ఏ రేంజ్ లో ట్రోల్స్ గురవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
అయినా అను నా ఇష్టం అంటూ ఇంకాస్త రెచ్చగొట్టేలా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ఇకపోతే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురయ్యే చేదు అనుభవాలను ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కరు బయట పెడుతున్న విషయం తెలిసిందే.. తాజాగా అను కూడా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది..
తాజాగా అనసూయ కూడా ఇండస్ట్రీలో తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొని మరింత ఎమోషనల్ అవడం ఇప్పుడు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాలలోనూ ఉంది కానీ సినిమా రంగం వాళ్ళు భారీగా పాపులారిటీ దక్కించుకుంటారు.
కాబట్టే ఇది అక్కడ ఎక్కువగా ఉందని అనిపిస్తుంది.. టాలీవుడ్ లో కూడా ఈ మాట ఎక్కువగా వినిపిస్తోందని చెప్పాలి. నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యాను. అప్పట్లో నన్ను కూడా కొంతమంది కోరిక తీర్చమంటూ వేధించారు. కానీ నేను ఒప్పుకోలేదు. దాంతో రెండు సంవత్సరాలు పాటు అవకాశాలు రాకుండా ఒంటరిగా ఉన్నాను..
టాలెంట్ ఉంటే చాలు అనుకున్న.. దాన్నే నమ్ముకున్న ఇక స్టార్డం వచ్చిన తర్వాత ఇలాంటివి మళ్లీ ఎదురు కాలేదు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.ఇక స్టార్డం వచ్చింది అంటే ఆటోమేటిక్గా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పినామే ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా వెండితెరకు దగ్గరగా కొనసాగుతోందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ నటిగా చలామణి అవుతోంది.. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. అనసూయ అందమే అందం, ఇద్దరు పిల్లలున్నా కూడా అందాలతో పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే..