బుల్లితెర యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని యూత్ ఉండరు.. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆమె అందం యువతను ఆకట్టుకుంటుంది.. ఇక అను కూడా ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్సులు వేస్తూ బోల్డ్ ఫోటోలకు పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది…అయితే ఎప్పుడు ఫోటోలను పంచుకొనే అనసూయ ఇప్పుడు తాజాగా తన భర్త గురించి ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

న్యూస్ రిపోర్టర్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లి తెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించిన అనసూయ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈమె ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తన భర్త సుశాంక్ ఇద్దరు పిల్లలతో కలిసి అనసూయ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. జూన్ 4వ తేదీ అనసూయ పెళ్లి రోజు సందర్బంగా కావడంతో ఈమె తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది..

ఆ పోస్ట్ లో ఏముందంటే.. నువ్వు నాకు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ ఇంకా గుర్తుంది. 2001, జనవరి 23లో న్యూఢిల్లీలోని ఆడిటోరియంలో నాకు లెటర్ ఇచ్చావు. ఇప్పటికి నేను ఆ లెటర్ కు రిప్లై ఇవ్వలేదని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. డియర్ నిక్కు నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు కృతజ్ఞతలు.నువ్వు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు ఎన్ని అవమానాలు ఎదురైనా మన ప్రేమ దేవాలయం కోసం నువ్వు ఒక పిల్లర్ గా నిలిచావు అంటూ రాసుకోచ్చారు.
ఇన్ని సంవత్సరాలు పాటు నువ్వు నన్ను ఎలా భరించావో నాకు అర్థం కావడం లేదు అలాగే నేను కూడా నిన్ను ఎలా భరించానో తెలియడం లేదు. నేను నా జీవితాంతం చికాకు పెట్టాలనుకునే ఏకైక వ్యక్తి నువ్వే. నాకు తెలుసు మనిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని మనిద్దరం మూర్ఖులమే. కొన్నిసార్లు ఒకరి కోసం ఒకరు లేకుండా ఎంతో దారుణంగా ప్రవర్తించాము. మన పెళ్లిని ఇలా డేటింగ్ లా చేసినందుకు నీకు థాంక్స్ పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ అనసూయ తన భర్తపై ఉన్న ప్రేమను పోస్ట్ ద్వారా తనకు తెలిసేలా చేసింది.. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింటం వైరల్ అవుతుంది.. మీరు ఒకసారి చూడండి..