Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా అమ్మడికి తెలుగు రాష్ట్రాల్లో అద్వితీయమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. ఇద్దరు కొడుకులు ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ స్క్రీన్ మీద రెచ్చిపోతుంటుంది. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్కన సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు, పర్సనల్ విషయాలకు సంబంధించిన అప్డేట్స్ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి సక్సెస్ అందుకుంటున్న అనసూయ.. పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్పలో దాక్షాయినిగా లేడీ విలన్గా ఢీ గ్లామర్ రోల్లో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 లో అనసూయ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనసూయ బుల్లితెరకు దూరంగా ఉన్నా.. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే బుల్లితెరకు దూరం అవ్వడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. కానీ ఆ లోటు అనసూయ సోషల్ మీడియా ద్వారా తీర్చుతున్నారు.
తాజాగా అనసూయకు ఉన్న సీక్రెట్ ఎఫైర్ గురించి తనంతట తానే బయట పెట్టింది. ఇట్స్ మై సీక్రెట్ ఎఫైర్ అంటూ అనసూయ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అనసూయ సీరియస్ ఎఫైర్ ఎవరితోనో కాదు మామిడిపళ్లతో. సమ్మర్ సీజన్ కావడంతో అందరికీ ఇష్టమైన మామిడి పళ్లు వచ్చేసాయి. అయితే అనసూయ ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్ల కాయలు కోసింది. తన ఇద్దరు కొడుకులు ఓ వ్యక్తితో కలిసి మామిడికాయలు తెంపి వాటిని చూపిస్తూ మామిడికాయల వేట.. ఇది ఒక సీరియస్ ఎఫైర్ అంటూ ఆమె కామెంట్ పోస్ట్ చేసింది. దీని బట్టి మామిడిపళ్ళు అంటే అనసూయకు ఎంత ఇష్టమో వాటితో ఉన్న ఎఫైర్ ఎలాంటిదో వివరించింది. అయితే ప్రస్తుతానికి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. తన ఫ్యాన్స్ అంతా ఆ పోస్ట్ కు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.