నటి అనసూయ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తోంది. ఆమధ్య విజయ్ దేవరకొండ మీద ఎదో కామెంట్ పెట్టింది, విజయ్ అభిమానులకి, అనసూయకి సాంఘీక మాధ్యమంలో వాదోపవాదాలు జరిగాయి. ఇక అలాంటిదే ఆమె ఎప్పుడూ ఏదైనా పోస్ట్ పెట్టో, లేదా ట్వీట్ చేసి ఇలా వార్తల్లో ఉంటూ వుండే అనసూయ మళ్ళీ వార్తలకెక్కింది. అయితే ఈసారి ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ కనపడింది.

ఇలా ఏడుస్తూ వున్నవీడియో పెట్టి ఒక సుదీర్ఘమైన నోట్ కూడా రాసింది. మరి ఆమెకి ఎవరు ఏమన్నారో, ఎందుకు ఆలా అంత సుదీర్ఘ నోట్ పెట్టిందో తెలియయటం లేదు కానీ, నోట్ సారాంశం మాత్రం, సాంఘీక మాధ్యమం అనేది అందరినీ కలిపేలా ఉంటుంది, అలాగే ఒకరి విషయాలు, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక వేదికలా ఉంటుంది అని, అలాగే వేరేవాళ్ళ జీవన విధానం, సంస్కృతి తెలియటం కోసం ఇది ఒక మంచి ప్రదేశం అని భావించాను, కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను, అని రాసింది. ఇలా రాసుకుంటూ, ఆమె ఫోటోస్, డాన్స్ వీడియోస్ ఇంకా ఆమె వ్యక్తిగతమైనవి ఏది ఆమె పోస్ట్ చేసిన అవన్నీ ఆమె జీవితంలో ఒక భాగం అని చెప్పింది. అవన్నీ ఆమె అభిమానులతో పంచుకుంటాను అవన్నీ కూడా ఆమె జీవితంలో జరిగే సంఘటనలు, స్ట్రాంగ్ గా వున్నప్పుడు, బ్రేక్ డౌన్ అయినప్పుడు అలాంటివి అన్నీ వున్నాయి అని చెప్పింది. అలాగే చివర్లో నేను బాగున్నాను, ఇది అయిదు రోజుల క్రితం రికార్డు చేసింది అని ఎదో చెప్పుకొచ్చింది.

దీంతో కామెంట్స్ లో మాత్రం ఇంతకీ అనసూయ ఏమైంది మీకు అని అభిమానులు అడుగుతున్నారు. కొందరు ఆమెకి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు, కొందరేమో ఆమె రాసింది అర్థం కావటం లేదు అని అంటున్నారు, ఇలా రకరకాలుగా ఈ వీడియో మీద కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత పలు ట్వీట్‌లకు ఆమె సమాధానం ఇస్తూ, ‘మీరు త్వరగా ఓ నిర్ణయానికి రాకుండా ఉండాల్సింది. ఊహాగానాలను హెడ్‌లైన్స్‌గా పెట్టకుండా ఉండాల్సింది.
నేను పంచుకున్న సమాచారం అర్థంకాకపోతే రెండుసార్లు చదువుకోవాల్సింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం నేను ఈ పోస్ట్ పెట్టానని అంటున్నారు. మనం ఈ ఫ్లాట్‌ఫాంలో ఉన్నదే ఇతరుల అటెన్షన్ కోసం. ఎవరిని నిందిస్తున్నారు. కనీసం నేను ఈ విషయాన్ని పారదర్శకంగా అంగీకరిస్తున్నా. అవును నాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నాకు అటెన్షన్ కావాలి’’ అని కొన్ని ట్వీట్‌లకు అనసూయ రిప్లై ఇచ్చారు. ఇది చూసిన వారంతా మీ మీద ఉన్న కాస్త గౌరవం కూడా పోయింది అని అనుకుంటున్నారు.