అనసూయ అంటే గ్లామర్, గ్లామర్ అంటే అనసూయ. యాంకరింగ్ కి గ్లామర్ టచ్ ఇచ్చి కొన్నేళ్లపాటు సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగిన అనసూయ ఇప్పుడు ఆ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ఏడాది అవుతుంది. యాంకరింగ్ నుండి వెండితెర మీదకి షిఫ్ట్ అయ్యి అక్కడ సక్సెస్ అవడంతో బుల్లితెరని పక్కనపడేసింది. ఇప్పుడు వెండితెర మీద జెండా పాతడానికి రెడీ అయ్యింది. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ రోల్స్ రాకపోయినా.. పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో హైలెట్ అవుతుంది.

ఇక తనకు ఏమాత్రం షూటింగ్ సమయంలో విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం అనసూయ తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెకేషన్ వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. వాటితో పాటు తాజాగా అనసూయ సుశాంక్ పెళ్లి రోజు కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఇక అవి చూసిన వారంత అనసూయ అందానికి ఫిదా అవుతున్నారు.

అనసూయ చాలా రొమాంటిక్. ఆమె ప్రేమించినవాడిని పట్టుబట్టి చేసుకుంది. అనసూయ-సుశాంక్ లకు పెద్ద ప్రేమ కథే ఉంది. అనసూయ చదువుకునే రోజుల్లో ఎన్ సి సి క్యాడెట్ అట. ఓ క్యాంపులో సుశాంక్ భరద్వాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. స్కూల్ డేస్ లో మొదలైన ఆకర్షణ కాలేజ్ డేస్ వరకు కొనసాగింది. పీకల్లోతు ప్రేమలో మునిగిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే అనసూయ తండ్రి అందుకు ఒప్పుకోలేదు. ఆయన సుశాంక్ అని అల్లుడిగా అసలు ఒప్పుకోలేదట. ఒక దశలో పెద్దలను ఎదిరించి అనసూయ ఇంటిలో నుండి బయటకు వచ్చేసింది.