Ananya Pandey : విజయ్ దేవరకొండ, బీ టౌన్ బ్యూటీ అనన్య పాండే నటించిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం లైగర్. భారీ అంచనాల మధ్య గతేడాది రిలీజ్ అయిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా లైగర్ మూవీ గురించి అనన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

లైగర్ మూవీ యాక్ట్ చేయడానికి కారణం వాళ్లిద్దరే అని. లేకపోతే ఆ మూవీ చేసేదాన్ని కాదని కామెంట్స్ చేసింది. కరణ్ జోహర్, మా అమ్మ.. వీళ్లద్దరూ చెప్పడం వల్లే లైగర్ మూవీలో నటించానని షాకింగ్ కామెంట్స్ చేసింది అనన్య. మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతీసారి ఆమె తల్లి తన అభిప్రాయాన్ని చెప్తుందని అంది. ఇలానే లైగర్ గురించి వాళ్ల అమ్మను ఓపీనియన్ అడిగానంది. లైగర్ జస్ట్ ఫన్..! అంటూ అనన్య వాళ్ల అమ్మ రివ్యూ ఇచ్చారంట.

తనకు వచ్చిన చెత్త రివ్యూ అదేననిపించిందంట. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారని.. వాటి నుంచి ఎన్నో నేర్చుకోవాలని అర్థమైనట్లు వివరించారు. ప్రస్తుతం అనన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో లైగర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో దీనిని తీయగా.. రూ.60 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా.