Ananya Nagala : అవకాశాల కోసమే ఎక్స్ పోజింగ్ చేస్తున్నా తప్పేంటి.. పచ్చిగా చెప్పిన అనన్య

- Advertisement -

Ananya Nagala : తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనన్య నాగళ్ల తన సినీ కెరీర్ తో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించింది. అందులో భాగంగా గత కొంత కాలంగా ఇన్‌స్టా గ్రామ్ లో గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేయడానికి గల కారణాలను వివరించింది. విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అన్వేషి’.

Ananya Nagala
Ananya Nagala

అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వీజే ఖన్నా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టి. గ‌ణ‌ప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది అనన్య నాగళ్ల. ‘వకీల్ సాబ్’ సినిమాకు ముందు వరకు సోషల్ మీడియాలో ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేసిన తాను, ఆ తర్వాత ఎందుకు గ్లామరస్ ఫోటోలు షేర్ చేయాల్సి వచ్చిందో అన్యన్య వివరించింది.

Ananya Nagalla
Ananya Nagalla

“పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్‌సాబ్‌’ సినిమాలో నేను కూడా ఓ కీలక పాత్ర పోషించాను. ఈ సినిమాకు ముందు వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెడిషనల్‌ లుక్‌ ఫొటోలు పంచుకునేదాన్ని. ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సమయంలో కొన్ని గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నా. ఆ ఫోటోలను క్యాజువల్ గానే సోషల్ మీడియాలో షేర్ చేశాను. వాటికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు సినిమా రంగంలో దూసుకెళ్లాలంటే అన్ని రకాలుగా కనిపించాలి అనుకున్నాను. అప్పటి నుంచి గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నా. కొన్ని కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా పెద్దగా కలిసి రాలేదు” అని వెల్లడించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here