Anachor Anasuya : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటు బుల్లి తెర, అటు వెండి తెరపై వరుసగా అవకాశాలు దగ్గించుకుంటూ దూసుకుపోతున్నారు అనసూయ భరద్వాజ్. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న బుల్లితెర, అటు వెండి తెరపై తన అంద చందాలతో అలరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అనసూయను ఆరాధించే అభిమానులు కోట్లలో ఉన్నారు. ప్రస్తుతం బుల్లి తెరకు దూరంగా వెండి తెరపై వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కథా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇటీవల అనసూయ ప్రేమ విమానం
సినిమాతో అభిమానులను పలకరించారు. అక్టోబర్ 12 నుండి జీ 5లో నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. భావోద్వేగాలతో సాగే ప్రేమ విమానం 50 మిలియన్ల వ్యూయర్ షిప్ తో ఓటీటీలో దూసుకుపోతోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అనసూయ. తాజాగా మరోసారి తన అందాలతో మెస్మరైజ్ చేసేశారు. ట్రెండీ వేర్లో తన అందాలను దాదాపు చూపిస్తూ టెంపరేచర్ అమాంతం పెంచేశారు. జబ్బలపై నుంచి టాప్ జారుతున్నా.. అందాలు చూపిస్తూనే ఉంటా తగ్గేదే లే అంటూ ఫోటోలకు పోజులిచ్చారు. కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా ఉన్న అనసూయ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అనసూయ అందాలు అదరహో అంటున్నారు.