టాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఉన్నత కుటుంబానికి చెందిన స్నేహా రెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్నాడు. టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా పేరుతెచ్చుకున్న వీరు మిడ్ నైట్ ఓ పబ్‌లో తొలిసారి పరిచయం చేసుకున్నారు. ఆ పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. అనంతరం ఇరువురి కుటుంబీకుల అంగీకారంతో ఇద్దరూ 2011, మార్చి 6న పెద్దల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే మొదట్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించకపోయినా.. ఆ తర్వాత వారే ఒప్పుకుని వైభవంగా వివాహం చేశారట. ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించక ముందే బన్ని తల్లి ఆయనకు వేరే సంబంధం చూసిందట. కానీ అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ఇష్టపడుతున్నానని చెప్పడంతో ఆమె ఏమి మాట్లాడలేక పోయిందట. తను పెట్టిన కండిషన్‌కు ఒప్పుకుంటేనే స్నేహను ఇంటి కోడలిగా అంగీకరిస్తాను అని చెప్పిందట అల్లు అర్జున్ తల్లి నిర్మల. లైఫ్‌లో ఇంకా బెటర్‌గా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో పిల్లలను కనే విషయంలో గ్యాప్ తీసుకోవటం ఆమెకు ఇష్టం లేదు. దీంతో స్నేహ రెడ్డి కూడా ఆ కండిషన్ కి ఒప్పుకుందట. అలా పెళ్ళైన మూడు సంవత్సరాల లోపే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఒక బాబుకి జన్మనిచ్చారు.ఆ తర్వాత బాబు పుట్టాక రెండు సంవత్సరాలకి పాపకి కూడా జన్మనిచ్చారు. షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా అల్లు అర్జున్ తన పూర్తి సమయాన్ని భార్య, పిల్లలకే కేటాయిస్తుంటాడు.

పుష్ప ది రైస్
తో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2
మూవీతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ మూవీకి దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమా కోసం బన్ని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.