Rashmika Mandanna : నెట్టింట్లో రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో వైరల్.. నేషనల్ క్రష్కు సపోర్ట్గా రంగంలోకి బిగ్ బీ అమితాబ్

- Advertisement -

Rashmika Mandanna : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ ఫాలోయింగ్ హీరోయిన్లలో ఫస్ట్ ప్లేస్ రష్మిక మందన్నదే. నేషనల్ క్రష్గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీల్లో తన సత్తా చాటుతోంది. పాన్ ఇండియా హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అంది వచ్చిన ప్రతి ఛాన్స్ను సరిగ్గా యూజ్ చేసుకుంటూ తన కెరీర్ గ్రాఫ్ను ఎక్కడికో తీసుకెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ అక్కడ సూపర్ ఆఫర్స్ దక్కించుకుంటోంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ చిన్న పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అలా తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే అది మార్ఫింగ్ వీడియో. రష్మికను వల్గర్గా మార్ఫ్ చేసి నెట్టింట పోస్టు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వీడియోపై ఓవైపు కేంద్ర ఐటీ శాఖ, మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఏకంగా రష్మికకు సపోర్టుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రంగంలోకి దిగారు. ఈ మార్ఫింగ్ వీడియోపై అమితాబ్ స్పందించారు. ఇలా ప్రముఖుల చిత్రాలను తప్పుడుగా ఉపయోగించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రష్మిక లాంటి టాలెంటెడ్ హీరోయిన్పై ఇలాంటి అసభ్య ప్రచారం చేయడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఆమెకు ఎల్లప్పుడూ తన సపోర్టు ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇతర బాలీవుడ్ ప్రముఖులు రష్మికకు మద్దతిస్తున్నారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -

అయితే ఈ వీడియోలో ఉంది రష్మిక కాదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉంది రష్మిక కాదని.. జారా పటేల్ అనే యువతి అని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు చట్టపరంగా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది.

మార్ఫింగ్‌ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని స్పష్టం చేసింది. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం… సోషల్ మీడియాలో ఏ యూజర్‌ కూడా నకిలీ/తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేయకుండా చూసుకోవాలి. ఒకవేళ అలాంటి ఫేక్‌ సమాచారాన్ని గుర్తిస్తే.. దాన్ని 36 గంటల్లోగా తొలగించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే రూల్‌ 7 కింద.. ఆ మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చు. మార్ఫింగ్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలి’’ అని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here