Ambati Arjun : ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినందుకు అర్జున్ అంబటి ని చూసి బిగ్ బాస్ ప్రేక్షకులు చాలా నిరుత్సాహానికి గురి అయ్యారు. కారణం ఈ రేంజ్ కంటెస్టెంట్ ముందుగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఉంటే కచ్చితంగా టైటిల్ ని గెలుచుకునే వాడు అని అందరి అభిప్రాయం. అతిగా మాట్లాడడు, ఎంత అవసరమో అంతే మాట్లాడుతాడు. సమయం వచ్చినప్పుడు ఇతనికి మించిన ఎంటర్టైన్మెంట్ ని పంచే కంటెస్టెంట్ మరొకరు లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇక టాస్కుల విషయానికి వస్తే అర్జున్ ని మించిన కంటెస్టెంట్ ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ బిగ్ బాస్ సీజన్స్ ని కలిపినా లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి కంటెస్టెంట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రావడం అనేది ఎవరికీ నచ్చలేదు. అర్జున్ ముందుగానే హౌస్ లోకి అడుగుపెట్టేవాడాట, కానీ బిగ్ బాస్ టీం చెప్పిన రెమ్యూనరేషన్ ఆయనకీ నచ్చకనే ముందుగా రాలేదట.
ప్రస్తుతం ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఓటింగ్ పరంగా అర్జున్ అందరికంటే చివర్లో ఉన్నాడని అందరికీ తెలుసు, ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జునే చెప్పాడు. ఇలా చివర్లో ఉన్నాను అని తెలిసిన కంటెస్టెంట్ కి డబ్బులు తీసుకునే ఆఫర్ వస్తే కచ్చితంగా వదులుకోరు, కానీ అంబటి అర్జున్ కి 20 లక్షల ఆఫర్ వచ్చినా కూడా చాలా తేలికగా వదిలేసుకున్నాడట. విషయం లోకి వెళ్తే ఆదివారం జరగబొయ్యే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం అయ్యిందట.
ఈ ఎపిసోడ్ లో సూపర్ సింగర్స్ సరికొత్త సీజన్ ప్రారంభం అవ్వబోతుండడం తో యాంకర్ శ్రీముఖి ప్రొమోషన్స్ కోసం వచ్చింది. ఆమెతో 20 లక్షల రూపాయిల సూట్ కేసు ని పంపి టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఎవరినో ఒకరిని టెంప్ట్ చేసి, బయటకి తీసుకొని రా అని నాగార్జున పంపుతాడు. ఎవ్వరూ కూడా ఈ ఆఫర్ ని అందుకోరు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా చివర్లో ఉన్నాను అని తెలిసినా కూడా ఆఫర్ ని రిజెక్ట్ చేసినందుకు అర్జున్ కి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.