రీసెంట్ గా విడుదలైన సినిమాల్లో ప్రొమోషన్స్ తో ఎంతగానో ఆకట్టుకొని ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం అంచనాలను ఏమాత్రం కూడా అందుకోకుండా చతికిల పడ్డ చిత్రాలలో ఒకటి ‘రంగబలి’. ప్రముఖ యంగ్ హీరో నాగ శౌర్య భారీ ఆశలు పెట్టుకొని, ఈసారి ఎలా అయినా కొడితే పెద్ద హిట్ కొట్టాలి అనే కసితో ఈ కమర్షియల్ సినిమాని చేసాడు. కానీ మొదటి ఆట నుండే అంచనాలను సరిగా అందుకోలేకపోయింది.

సినిమా విడుదలకు ముందు చేసిన హుంగామ లో పావు శాతం కూడా ఈ చిత్రం విషయం లో చెయ్యలేదు. ఇది నిజంగా శోచనీయం, పాపం సరైన హిట్ కోసం అన్నీ రకాలుగా అర్హతులు ఉన్న నాగ శౌర్య కి నోటిదాకా వచ్చి అందకుండా పోయింది అనే బాధ నాగ శౌర్య ని అభిమానించే వారితో పాటుగా ప్రేక్షకుల్లో కూడా కలిగింది. అయితే ఈ చిత్రం రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

నెట్ ఫ్లిక్స్ లో విడుదలైనప్పుడు మాత్రం ఈ చిత్రానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కమెడియన్ సత్య చేసిన కామెడీ సన్నివేశాలు కొన్ని సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.అంతే కాదు, నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలను కూడా అధిగమించి టాప్ లో ట్రెండింగ్ అవుతుంది.

నెట్ ఫ్లిక్స్ సంస్థ అంచనాల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 50 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయట. ఒక స్టార్ హీరో సినిమా ఓటీటీ లో విడుదలైతే మొదటి రోజు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ సినిమాకి కూడా అదే స్థాయి రెస్పాన్స్ వచ్చిందట. సినిమా ఫ్లాప్ అయ్యిందని డీలాపడిన శౌర్య కి ఓటీటీ స్ట్రీమింగ్ రెస్పాన్స్ ని చూసి కాస్త ఊరట ని ఇచ్చింది అని చెప్పొచ్చు.