Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్కు గెలిచి మొట్టమొదటి ఫైనలిస్ట్ గా అడుగుపెట్టిన అర్జున్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి శుభాకాంక్షలు వెల్లువలాగా కురుస్తుంది. మిగిలిన కంటెస్టెంట్స్ లాగ కాకుండా, కేవలం తన సొంత పాయింట్స్ తో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కంటెస్టెంట్ గా అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అయితే ఈ వారం ఆయన నామినేషన్స్ లో చెప్పిన కొన్ని పాయింట్స్ వల్ల వేరే లెవెల్ నెగటివిటీ ని మూటగట్టుకొని డేంజర్ జోన్ లోకి వచ్చాడు. కానీ ఆయన ఆడిన ఆట తీరుకి ఆడియన్స్ ఫిదా అయిపోయి ఓట్లు వేసి సేవ్ చేసారు. ఇదంతా పక్కన పెడితే అర్జున్ కి అమర్ దీప్ బయట మంచి స్నేహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ హౌస్ లో మాత్రం అమర్ ని దూరం గా పెడుతూ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

దీనిపై అమర్ దీప్ భార్య తేజస్విని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ అర్జున్ అలా చెయ్యడం నాకు కూడా చాలా బాధ అనిపించింది. అమర్ అతనిని ఎంతగానో అభిమానిస్తుంటాడు. అర్జున్ కేవలం గేమ్ పరంగా అమర్ ని పక్కన పెట్టుంటే నేను అర్థం చేసుకోగలను, కానీ నిజంగానే దూరం పెట్టినట్టు అయితే అది చాలా తప్పు, హౌస్ లోకి వెళ్ళినప్పుడే ఈ విషయం అర్జున్ ని అడగాలని అనిపించింది, కానీ బయటకి వచ్చిన తర్వాత అడుగుదాంలే అని ఆగాను’ అంటూ చెప్పుకొచ్చింది. అర్జున్ కేవలం అమర్ దీప్ కి మాత్రమే కాదు, తేజస్విని కి కూడా మంచి స్నేహితుడు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు కూడా నేను అర్జున్ తో మాట్లాడాను, హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా నేను అమర్ తర్వాత ఎక్కువగా అర్జున్ తోనే మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని.