Pallavi Prashanth : నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు నాన్ బైలబుల్ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన్ని ఇటీవలే చంచల్ గూడ సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే ఇప్పుడు ఆయనకీ బైలు మంజూరు అయ్యినట్టుగా తెలుస్తుంది.

కానీ ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్ కి వచ్చి సంతకం చెయ్యాలని పోలీసులు ఆదేశించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ బిగ్ బాస్ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ హౌస్ లో అనేక సార్లు పెద్ద గొడవలు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నామినేషన్స్ సమయం లో వీళ్ళిద్దరూ ఎక్కడ కొట్టుకుంటారో అని చూసే ప్రేక్షకులు భయపడ్డారు. కానీ అలాంటివి ఏమి జరగలేదు కానీ అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూమ్ కి వెళ్లిన సంఘటన మాత్రం పెను దుమారమే రేపింది.

ఈ సంఘటన వల్లే ఆగ్రహించిన పల్లవి ప్రశాంత్ అభిమానులు మొన్న అమర్ దీప్ కార్ పై దాడులు జరిపారని తెలుస్తుంది. అయితే అభిమానుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, హౌస్ లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల వాళ్లిద్దరూ ఎన్ని సార్లు గొడవ పడినా , చివరికి వాళ్లిద్దరూ ఎప్పటికీ మంచి స్నేహితులే. బయటకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరు అలాగే ఉంటారనే విషయం అందరికీ తెలుసు.

అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ బాధపడ్డారు. ముఖ్యంగా హౌస్ లో మొదటి నుండి ప్రశాంత్ తో కలిసి ఉన్న శివాజీ మరియు యావర్ స్పందించారు. ఇక అమర్ దీప్ అయితే అనంతపురం నుండి తిరిగి రాగానే నిన్న చంచల్ గూడా జైలు కి వెళ్లి ప్రశాంత్ ని కలిసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో వైరల్ అయిన వార్తని చూసి ఇది నిజమైన స్నేహం అంటే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.