Bigg Boss Telugu 7 : నా కొడుకు పై బిగ్ బాస్ కుట్రలు చేస్తున్నాడు అంటూ అమర్ దీప్ తల్లి ఆవేదన.. చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

- Advertisement -

Bigg Boss Telugu 7 : ఈ సీజన్ బిగ్ బాస్ ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ తో కంటెస్టెంట్స్ మరియు ప్రేక్షకులకు ఊహించని రేంజ్ ట్విస్టులు ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంది ఈ రియాలిటీ. హౌస్ లోకి ఎప్పుడైతే కొత్త కంటెస్టెంట్స్ అడుగుపెట్టారో, అప్పటి నుండి గేమ్ మొత్తం మారిపోయింది. మొదటి 5 వారాలు చూసిన బిగ్ బాస్ సీజన్ ఒకటి, ఇప్పుడు చూస్తున్న సీజన్ ఒకటి లాగ అనిపిస్తుంది.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

ముఖ్యంగా అమర్ దీప్ లో చాలా మార్పులు వచ్చాయి. తనని ఒక మాట అంటే తీసుకోలేని అమర్ దీప్ గొడవల్లోకి చాలా తేలికగా వెళ్లిపోయేవాడు. కానీ ఈసారి అమర్ దీప్ కంటెస్టెంట్స్ రాకతో బయట తన గురించి జనాలు ఎలా అనుకుంటున్నారో తెలుసుకున్నాడు. అప్పటి నుండి మానసికంగా బాగా కృంగిపోయాడు. ఇక తన పని అవుట్ , ఈ వారం జనాలు బయటకి పంపిస్తారు అని ఫిక్స్ అయిపోయాడు.

Amar Deep

‘జానకి కలగనలేదు’ అనే బ్లాక్ బస్టర్ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అమర్ దీప్, కచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకొస్తాడు అనే విధంగా అనుకున్నారు అందరూ. మొదటి వారం ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ రైతు బిడ్డ, బీటెక్ గురించి ప్రస్తావించి ఒక రేంజ్ లో వైరల్ అయ్యాడు. ఆ తర్వాత తన సీరియల్ బ్యాచ్ తో కలిసి తొండి ఆటలు ఆడుతున్నాడు అని సోషల్ మీడియా లో నెగటివిటీ తెచ్చుకున్నాడు. ప్రతీ విషయం అవసరం లేని హీరోయిజం చూపించి కమెడియన్ అయిపోయాడు. అయితే అమర్ దీప్ పై సోషల్ మీడియా లో జరుగుతున్న నెగటివిటీ ని గమనించిన అతని తల్లి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్పందించింది.

- Advertisement -

‘నా కొడుకు ని అందరూ చాలా తప్పుగా అనుకుంటున్నారు, వాడు చాలా మంచోడు, చాలా కస్టపడి పైకి వచ్చాడు. మంచిగా యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ అదరగొడుతాడు. రైతులను తక్కువ చెయ్యడం వాడి ఉద్దేశ్యం కాదు, వాడు చెప్పాలనుకున్నది వేరే. ఎప్పటికైనా రైతే రాజు, మా నాన్న కూడా ఒక రైతు, నా భర్త ఒక మెకానిక్, మేము ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం, దయచేసి మా మీద ద్వేషం చూపించకండి. బిగ్ బాస్ లో చాలా వరకు జనాలకు చూపించకుండా మా బాబు ని తోక్కేస్తున్నారు. దయచేసి మా అబ్బాయికి సపోర్టు చెయ్యండి’ అంటూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడింది అమర్ దీప్ తల్లి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here