బిగ్ బాస్ 7 వ సీజన్ రెండవ వారం నామినేషన్ ప్రక్రియ వాడీ వేడీగా సాగింది. ఇది ప్రతీసజన్‌లో ప్రతీ వారం చూసేదే.. కానీ ఈ సీజన్‌లో కంటెస్టంట్లు అదుపు తప్పినట్టు కనిపించింది. ముఖ్యంగా అమర్ దీప్ వ్యవహారం శృతిమించింది. పల్లవి ప్రశాంత్ పై తన పెత్తనం చూపెట్టడం క్లియర్ గా కనిపించింది. ఏ రేంజ్‌లో అంటే ప్రశాంత్ ఏదో అమర్ దీప్‌కి బానిస అన్నంతలా అరేయ్ ఒరేయ్ అంటూ రెచ్చిపోయాడు.

అవును రా అమర్ దీప్‌గా ఆ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్‌లోకి ఎందుకొచ్చాడో.. ? వచ్చే డబ్బు ఏం చేసుకుంటాడో నీకెందుకురా..?? అతను వచ్చే డబ్బులు రైతులకే ఇస్తాడు లేకపోతే ఇంకెవరికైనా ఇస్తాడు లేదంటే తనే పెట్టుకుంటాడు.. నీవేంట్రా నీ డబ్బులు నీ పక్కింటోళ్ళకి ఇస్తావా..? ఆ రైతు బిడ్డ బిగ్ బాస్‌లోకి వచ్చింది డబ్బులు, పేరు సంపాదించటానికే అనుకుందాం అయితే నీదేం పోయిందిరా..? వాడేమి దేశాన్ని ఉద్దరిస్తందుకు రాలేదుగా..??

అమర్ దీప్ అనే కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ ని మాటకి ముందు, మాటకి తర్వాత ‘రా ‘,’రా’ అంటూ సంభోదిస్తూ అతని పై చేసిన కామెంట్స్ కి నెటిజెన్స్ నుండి చాలా తీవ్రమైన వ్యతిరేకత వినిపిస్తుంది. వాళ్ళ తరుపున నుండి అమర్ దీప్ కి కొన్ని ప్రశ్నలు సందిస్తున్నాం. సీరియల్స్ చేస్తూ కోట్లు సంపాదించి లగ్జరీ జీవితం ని ఎంజాయ్ చేస్తున్న నీకు (అమర్) , ఒక సామాన్య రైతుబిడ్డని అవమానిస్తూ అన్ని సార్లు ‘రా’ అని సంభోదించడం ఏమిటా రా అమర్?.
పల్లవి ప్రశాంత్ కి పాపం కనీసం మాట్లాడడం కూడా రావడం లేదు, అతనికి ఈ వాతావరణం మొత్తం కొత్త, అలాంటి వ్యక్తి ఎదో నేరం చేసినట్టు గొంతు చించుకొని పడిపోవడానికి నీకు సిగ్గు లేదా రా అమర్?. బీటెక్ చదివే వాడి కష్టాలు, రైతు కష్టాలు ఒకటే అని అంటున్నావ్, పంట చేతికి అందే వరకు డబ్బులు వస్తాయని నమ్మకం లేదు, లక్షల పెట్టుబడి మొత్తం బూడిదపాలు అయ్యే ప్రమాదం ఉంది ఒక్క అకాల వర్షం వస్తే, అలా జరిగి ఇప్పటి వరకు ఎంతమంది రైతులు చనిపోయారో తెలుసా రా అమర్?, అలాంటి వృత్తిని బీటెక్ తో పోలుస్తావా, అసలు నువ్వు మనిషివేనా?.

పల్లవి ప్రశాంత్ సంపాదించిన డబ్బులు ఎవరికి ఇవ్వాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా?, అతను ఆ వృత్తిలో ఉన్నాడు కాబట్టి , అందులో కష్టాలు తెలుసు కాబట్టి ఇస్తానని అన్నాడు, ఈ పాయింట్ ని కూడా పట్టుకొని టార్గెట్ చెయ్యడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా అమర్..?, నువ్వు ప్రశాంత్ మీద వేలు ఎత్తి చూపుతూ చేసిన కామెంట్స్ అన్నీ చాలా సిల్లీ గా ఉన్నాయి , నీ అరుపుల్లో ప్రశాంత్ ఇంట్లో అందరి కంటే టాప్ స్థానం లో ఉన్నాడు అనే అక్కసు తప్ప మరొకటి కనిపించలేదు రా అమర్. పద్దతి మార్చుకొని కాస్త బలుపు తగ్గించుకొని ఆడితే టాప్ 10 లో అయినా ఉంటావు, లేకపోతే ఎంత ఫాస్ట్ గా వచ్చావో, అంతే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోతావు, జాగ్రత్త రా అమర్. ఇదంతా సోషల్ మీడియా లో నెటిజెన్స్ తరుపున మాట్లాడుతున్న మాటలు.
ఒక సెలబ్రిటీ ని పట్టుకొని ఇన్ని సార్లు ‘రా’ అంటున్నాడు ఏందీ, మర్యాద లేదా అని మీకు అనిపించొచ్చు, కానీ ఒక సామాన్యుడిని బిగ్ బాస్ హౌస్ లో అంతలా టార్గెట్ చేసి , ఇక వచనంతో తిట్టినప్పుడు, ఒక సామాన్యుడిగా మనోభావాలు దెబ్బ తిని అతనిని మేము కూడా ‘రా’ అనడం లో తప్పు లేదు కదా, కాబట్టి ఇది గమనించగలరు.