Big Boss : మధ్యలో మాట్లాడితే పగిలిపోతాది అంటూ భోలే కి వార్నింగ్ ఇస్తూ కుర్చీ ని విరగ్గొట్టిన అమర్..!

- Advertisement -

Big Boss : బిగ్ బాస్ షో లో మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఘట్టం నామినేషన్స్ ప్రక్రియ. ఈ సీజన్ బిగ్ బాస్ షో ప్రారంభమై 50 రోజులు పూర్తి అయ్యింది. నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ చాలా హీట్ వాతావరణం మధ్య జరిగింది. గత వారం భోలే శవాలీ అన్న మాటలకు చాలా సేపు చర్చ ఈ నామినేషన్స్ లో నడిచింది. మనుషులను రెచ్చగొట్టడం అనేది భోలే కి బాగా అలవాటు అనే సంగతి అందరికీ తెలిసిందే.

Big Boss
Big Boss

తనని నామినేట్ చెయ్యడానికి వచ్చిన వాళ్ళను కించ పర్చడం, వాళ్ళను వెక్కిరించాడు, ఇతని మెంటాలిటీ చూస్తే హిమాలయాల్లో తపస్సు చేసుకునే మునీశ్వరులు కూడా కోపం రప్పిస్తుంది అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ శోభా విషయం లో ఆయన చెప్పిన పాయింట్ మాత్రం సమంజసం గానే ఉంది. క్షమించమని అడిగిన తర్వాత కూడా ఆమె అంతలా బెట్టు చెయ్యడం సరికాదు అనిపించింది.

ఈరోజు జరిగింది సగం నామినేషన్స్ మాత్రమే, మిగతా సగం నామినేషన్స్ రేపు జరగబోతుంది. రేపు కొనసాగబోయ్యే నామినేషన్స్ లో యావర్ సందీప్ ని నామినేట్ చేస్తాడు. మీ సేఫ్ ప్లే ఆడుతున్నారు అని యావర్ అంటే, సందీప్ అందుకు నీ అంత సేఫ్ ప్లేయర్ హౌస్ లో ఎవ్వరూ లేరు అని అంటాడు. అప్పుడు యావర్ అందుకే నేను మొదటి వారం నుండి నామినేషన్స్ లో ఉన్నా అని అంటాడు, అప్పుడు సందీప్ అందుకే నేను మొదటి వారం నుండి నామినేషన్స్ లేను అని అంటాడు. అవును నువ్వు నామినేషన్స్ లో లేవు, అందుకే నువ్వు సేఫ్ ప్లేయర్ అని యావర్ అంటాడు.

- Advertisement -

అలా వాళ్ళ మధ్య చర్చ నడుస్తూ ఉండగా మధ్యలో భోలే కల్పించుకొని సందీప్ బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నాడు అని అంటాడు. అప్పుడు సందీప్ తప్పుగా మాట్లాడొద్దు అని అరుస్తూ భోలే వైపు వెళ్తాడు. ఇక ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ ని నామినేట్ చేస్తాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది, మధ్యలో భోలే కల్పించుకుంటాడు. అప్పుడు కోపం అదుపు తప్పిన అమర్, మధ్యలో మాట్లాడితే పగిలిపోతాది అంటూ కుర్చీని కాళ్లతో ఎగిరి కొడతాడు. ఇక్కడి నుండి బిగ్ బాస్ కప్ కొట్టుకునే వెళ్తా అంటూ పెద్దగా అరుస్తాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here