బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో మనుషుల మధ్య గొడవలు పెట్టి.. ప్రేక్షకులు అది చూసి ఎంజాయ్ చేసేలా చేయడమే మేకర్స్ ప్లాన్. ఆ ప్లాన్ అర్థమయిన కొందరు కంటెస్టెంట్స్ కూడా కావాలని ఇతర కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకుంటారు. తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తుంటే.. రతిక కూడా అదే ప్లాన్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరినీ రెండు టీమ్స్‌గా విభజింజారు బిగ్ బాస్. అవే రణధీర, మహాబలి. ఆ రెండు టీమ్స్‌కు రెండు ఛాలెంజ్‌లు పెట్టగా.. ఆ రెండిటిలో రణధీర టీమ్ గెలిచింది.

మహాబలి టీమ్ నుండి వెళ్లాల్సిన మూడో కంటెస్టెంట్ ఎవరు అనే చర్చ మొదలయ్యింది. చివరిగా వెళితే ఆటను డిసైడ్ చేయవచ్చనే కారణంతో టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ చివరిలో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే రతికను ముందుగా వెళ్లమన్నారు. వారి స్ట్రాటజీ అర్థమయిన రతిక.. అసలు వెళ్లనంటూ మొండికేసింది. టీమ్‌లో తన మాట ఎవరూ వినడం లేదని నిందలు వేసింది. ‘గట్టిగా మాట్లాడకు. నేను కూడా మట్లాడగలను’ అంటూ దామినిపై అరిచింది. దీంతో దామిని కన్నీళ్లు పెట్టుకుంది.

రతిక సమయాన్ని వృధా చేస్తుంది అని గమనించిన బిగ్ బాస్.. తరువాతి మహాబలి టీమ్ నుండి ఎవరు రావాలి అనేది రణధీర టీమ్ మెంబర్స్‌ను డిసైడ్ చేయమన్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం రణధీర టీమ్‌లో ఎవరి చేతిలో అయితే మాయాస్త్రం లేదో వారు ఇక ఆటలో లేనట్టే అని ప్రకటించాడు. ఇలా ప్రకటించిన తర్వాత అమర్‌దీప్ కోపంతో ఊగిపోయాడు. రెండురోజులు అంత కష్టపడి ఆడిన తర్వాత ఇంత చిన్న కారణం వల్ల ఆట నుండి తప్పుకోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు పల్లవి ప్రశాంత్ చెప్పింది పాయింటే కాదంటూ విమర్శించాడు. చివరిగా బూతులు కూడా మాట్లాడాడు.