Sneha Reddy : టాలీవుడ్ లో చాలామంది క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న స్టార్ జోడిలు ఉన్నారు.. వారిలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి జంట కూడా ఒకరు.. వీళ్ళిద్దరూ ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో మొదటిసారి కలుసుకొని తొలిచూపులోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అంతేకాదు వీళ్ళ పెళ్లికి స్నేహ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా తానే పట్టుబట్టి బన్నీని చేసుకుంటానని అనడంతో.. ఇక ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరికీ పెళ్లి చేశారు ఇక పెళ్లాక అల్లు అర్జున్ సినిమాల పరంగా బాగా సక్సెస్ అయ్యారు. వీళ్ళిద్దరికీ ఆయాన్, అర్హ పుట్టారు. స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది..

స్టార్ మోడల్ కూడా ఈర్ష పడేలా స్నేహ రెడ్డి గ్లామర్ ఉంది. ఇక తరచుగా ఆమె సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా స్నేహ రెడ్డి ఇంస్టాగ్రామ్ లో వీడియోను పంచుకోగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టైలిష్ ట్రెండీ వేర్స్ ధరించిన స్నేహ రెడ్డి అద్దం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకున్న పలు ఆసక్తికర ఫోటోలను ఆ వీడియోలో పంచుకుంది..
స్నేహ రెడ్డి ఆ వీడియోను పంచుకోవడంతో పాటు అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది . మరి మీకు అంటూ ట్యాగ్ కూడా చేసింది. ఈ వీడియోలో స్నేహ రెడ్డి పలు ట్రెండీ వెస్ట్రన్ వేర్ ధరించి డిఫరెంట్ లుక్స్ లో డిఫరెన్స్ స్టైల్ లో ఫోజులిచ్చింది. వయ్యారాలు పోతున్న స్నేహ రెడ్డి ఫోటోలు నేటిజన్స్ ను ఆకర్షిస్తున్నాయి..
స్నేహ రెడ్డి వీడియోకు లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. బన్నీ ఫాన్స్ అయితే ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్హ సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వండి.