మామూలుగా సినీ ఇండస్ట్రీ అంటేనే పోటీ ఎక్కువగా ఉంటుంది. పక్కన వాళ్ళని ఓడించి పైకి ఎదగాలి అని చాలామంది అనుకోవడం సహజం. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉన్న ఫ్యామిలీస్స్ మెగా ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ,అక్కినేని ఫ్యామిలీ ,ఘట్టమనేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ.ఈ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువగా హీరోలే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించిన మిగిలిన ఎన్నో రకాల వ్యక్తులు ఉన్నారు.

అయితే ముఖ్యంగా మెగా మరియు అల్లు ఫ్యామిలీ ల మధ్య తెలియని పోటీ భీభత్సంగా ఉంది అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అల్లు అరవింద్ రామ్ చరణ్ తొక్కేయాలి అనుకునే అంతగా ఈ రెండు కుటుంబాల మధ్య పోటీ ఉందట.అల్లు అరవింద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ సినీ నిర్మాత అలాగే అల్లు అర్జున్ తండ్రి కూడా. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఇతను ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించారు.

అయితే వ్యక్తిగతంగా ఇతను బాగా కుళ్లుకుంటాడని చాలామందికి తెలియదు. మరి ముఖ్యంగా తన ఫ్యామిలీ కంటే ఇంకెవరన్నా హై పోసిషన్ కి వెళ్తే అస్సలు ఓర్చుకోలేరట.తోబుట్టువు కొడుకైన రామ్ చరణ్ పైన కూడా అతను తన కుళ్ళు బోతు బుద్ధి ప్రదర్శించాడు. రామ్ చరణ్ చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలో ఎంటర్ అయిన విషయం తెలిసిందే.
చిరుత రామ్ చరణ్ కెరియర్ లో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడమే కాకుండా మెగా అభిమానుల దృష్టిలో అతన్ని బాగా హైలైట్ చేసింది. ఇలాగే వదిలేస్తే రామ్ చరణ్ తన కొడుకు అల్లు అర్జున్ కంటే మంచి హోదాకి వెళ్తాడేమో అని భావించి అతని కెరియర్ని తొక్కేయాలని చూసాడట అల్లు అరవింద్.రామ్ చరణ్ కోసం వచ్చే కథలన్నీ అల్లు అర్జున్ చేసే విధంగా డైరెక్టర్లతో చర్చలు జరిపే వాడట.
రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మగధీర సినిమాను సైతం అల్లు అర్జున్ దగ్గర చేయించాలని తెగతాపత్రాయపడ్డాడట. ఈ మూవీకి చరణ్ కాకుండా అల్లు అర్జున్ హీరో అయితే బాగుంటుంది అని రాజమౌళిని తెగ ఇబ్బంది పెట్టాడు. ఇక ఊరుకుంటే లాభం లేదు అని రంగంలోకి దిగిన చిరంజీవి తన స్టైల్ లో ఈ మాటను సెట్ చేశాడు. మరోపక్క ఇలా చేయడం మంచి పద్ధతి కాదని అల్లు అర్జున్ ఎన్నోసార్లు తండ్రిని వారించిన అతని మాత్రం కొడుకు మీద ఉన్న ప్రేమతో తన ప్రయత్నాలు తాను చేసేవాడు.