Sneha Reddy : స్టార్ సెలబ్రిటీస్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి ముందు వరుసలో ఉంటాడు. ముఖ్యంగా స్నేహ రెడ్డి అయితే మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరి కంటే ఎంతో బాగుంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమెకి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు నిమిషాల వ్యవధి లోనే లక్షల సంఖ్యలో లైక్స్ వస్తుంటాయి. సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే ఈ రేంజ్ రీచ్ ఉంటుంది. వాళ్ళ తర్వాత అల్లు స్నేహ రెడ్డి కి మాత్రమే ఆ రేంజ్ రీచ్ ఉంది. సాధారణంగా పిల్లలకు జన్మని ఇచ్చిన తర్వాత ఎవరికైనా అందం తగ్గడం సహజం. కానీ అల్లు స్నేహా రెడ్డి మాత్రం అదే రేంజ్ గ్లామర్ ని మైంటైన్ చేస్తూ వస్తుంది.

ఆమె ఆ రేంజ్ గ్లామర్ మైంటైన్ చెయ్యడానికి కారణం సరైన డైట్ మరియు వర్కౌట్స్ చెయ్యడమే అని సోషల్ తెలుస్తుంది. రీసెంట్ గా ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. కుర్రాళ్ళు ఈ ఫోటోలను చూసి మెంటలెక్కిపోతున్నారు. సినిమాల్లో హీరోయిన్ గా వచ్చి ఉంటే పెద్ద రేంజ్ వెళ్లేవారు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సుకుమార్ తో కలిసి పుష్ప సీక్వెల్ ‘పుష్ప ది రూల్’ లో నటిస్తున్నాడు. ఆగష్టు 15 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో మరియు ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
