తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే స్టార్ హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ప్రారంభం నుండే తన అద్భుతమైన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఎవ్వరూ అనుకోని పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ఇన్ని రోజులు కేవలం వెండితెర కి మాత్రమే పరిమితమైన అల్లు అర్జున్ ఇక బుల్లితెర ఆడియన్స్ ని కూడా అలరించబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు.

ఆహా మీడియా అల్లు అర్జున్ ని హీరో గా పెట్టి ఒక సినిమాని చేయబోతున్నారట. అది కేవలం ఓటీటీ ఆడియన్స్ కి మాత్రమే అని తెలుస్తుంది. ఈ సినిమాకి దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నాడు అట. ఇక నేడు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీల పుట్టిన రోజు కావడం తో ఆమెతో కలిసి అల్లు అర్జున్ డ్యాన్స్ వేస్తున్న ఫోటో స్టిల్ ఒకటి కాసేపటి క్రితమే విడుదల చేసారు.

అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏమి లేదు, కానీ ఆయన డ్యాన్స్ స్టెప్స్ కి మ్యాచ్ చెయ్యగలిగే హీరోయిన్ శ్రీలీల మాత్రమే. ఎలాంటి హీరో ని అయినా తన డ్యాన్స్ మూమెంట్స్ తో డామినెటే చెయ్యగల సత్తా ఉన్న శ్రీలీల అల్లు అర్జున్ తో కలిసి ఏ రేంజ్ లో డ్యాన్స్ వేసి ఉంటుందో ఊహించుకోవచ్చు. వీళ్లిద్దరి కలయిక లో తెరకెక్కిన ఆ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారట. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో దీనిపై ఇంకా కన్ఫ్యూజన్ ఉంది.

అసలు అల్లు అర్జున్ నిజంగానే ఓటీటీ మూవీ చేస్తున్నాడా?, లేదా వేరే హీరో ఆహా లో చేస్తున్న సినిమాకి ప్రొమోషన్స్ చేస్తున్నాడా అనే సందేహం లో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ నిజంగానే ఓటీటీ మూవీ చేసాడని, దీనికి సంబంధించిన షూటింగ్ ‘పుష్ప : ది రూల్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందే పూర్తి చేసారని, ఇప్పుడు స్ట్రీమింగ్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారని చెప్తున్నారు ఆహా మీడియా కి సంబంధించిన కొంతమంది టెక్నిషియన్స్.