Allu Arjun : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పేరుకు ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ మరియు కూతురు అల్లు అర్హ సోషల్ మీడియా కారణంగా అందరికీ సుపరిచితులు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తమ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న పెద్ద విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం చిత్రంలో నటించిన అల్లు అర్హ మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఇద్దరి స్టార్ కిడ్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అల్లు అయాన్ కు సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అల్లు అర్జున్ కుమారుడికి ఫేవరెట్ హీరో అతని తండ్రి కాదు.. అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.మరి ఇంతకీ అల్లు అయాన్ ఫేవరెట్ హీరో ఎవరా అంటే…ఆ లిస్ట్ లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. మహేష్ బాబు మరియు రామ్ చరణ్ అంటే అల్లు అయాన్ కు ఎంతో ఇష్టమని ఓ సందర్భంలో అల్లు అర్జున్ తెలియజేశారు.
రామ్ చరణ్ సినిమా విడుదలయితే ఆ పాటలు తిరిగి మరొక సినిమా విడుదల అయ్యేవరకు అయాన్ చూస్తూనే ఉంటాడట. చరణ్ ముద్దుగా చెర్రీ మామ అని పిలిచే ఆయా రంగస్థలం మూవీ లో చరణ్ లుంగీ కట్టడం చూసి తనకు కూడా లుంగీ కావాలి అని మారం చేసేవాడట.
ఇక మహేష్ బాబు సినిమా అంటే అసలు కదలకుండా చూస్తాడట.ఈ విషయాలన్నీ స్వయంగా అల్లు అర్జున్ వెల్లడించడం జరిగింది. ఎప్పుడూ ఏదో సందర్భంలో చెప్పినా మాటలను తిరిగి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో ఎవరు అభిమానులు షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి.