Allu Arjun : ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులు పెళ్లి చేసుకుని వారి బ్యాచిలర్ జీవితాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుండగా.. మరికొందరు పెద్దలు చూసిన వాళ్లను చేసుకుంటున్నారు. స్టార్ సెలబ్రిటీస్ కూడా కొంతమంది గతంలో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి కొంతమంది అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్లను గాఢంగా ప్రేమించి ఇంట్లో చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా సరే ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఆ జాబితాలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ఇద్దరికీ అస్సలు టచ్ ఉండదు.
అల్లు అర్జున్ ఎలాంటి ఎనర్జీతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన భార్య స్నేహ రెడ్డి మాత్రం చాలా కూల్ గా ఉంటుంది. అసలు ఆమె మాట్లాడిన సందర్భాలు మనం ఇప్పటివరకు రెండో మూడో చూసుంటే అదే గొప్ప.. అంత సైలెంట్ అయితే వీళ్లిద్దరికీ ఎలా మ్యాచ్ అయిందా..? అంటే అది దేవుడు నిర్ణయమే.. అదంతా ప్రేమ మాయ.. ప్రేమ ఏమైనా చేస్తుందంటూ అంటున్నారు ఫ్యాన్స్.
చాలా అన్యోన్యంగా ఉంటుంది.. చక్కగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఎంత చక్కగా.. ఆనందంగా ఉన్నా ఫ్యామిలీలో గొడవలు అనేవి కామన్. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాలు కచ్చితంగా వస్తూనే ఉంటాయి . అయితే అల్లుఅర్జున్ స్నేహారెడ్డిల మధ్య కూడా అప్పుడప్పుడు గొడవలు వస్తాయట. మరీ ముఖ్యంగా వీళ్ళ మధ్య వచ్చే గొడవలు పిల్లల విషయంలోనే.. స్నేహ రెడ్డి పిల్లలను పడుతూ లేస్తూ పెంచాలి.. దెబ్బ తగిలితేనే వాళ్ళకి ఆ నొప్పి బాధ తెలుస్తుంది.. లైఫ్ లో స్ట్రాంగ్ అవ్వగలరు అనుకుంటుందట. కానీ అల్లు అర్జున్ తన పిల్లలకు దెబ్బ తగిలితే చూడలేడు.. అందుకే అన్ని వాళ్ళు అడగకముందే.. అన్ని సౌకర్యాలను సమకూరుస్తాడట. ఆ విషయంలో మాత్రం స్నేహారెడ్డి అల్లు అర్జున్ డిఫరెంట్ మైండ్ సెట్. అందుకే వాళ్లకు గొడవలు వస్తూనే ఉంటాయట.