National Film Awards 2023 : వందేళ్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి 90 ఏళ్ళు సుదీర్ఘ ప్రస్థానం ఉంది. ఎంతో మంది దిగ్గజ నటీనటులు ఈ ఇండస్ట్రీ నుండి వచ్చారు. వీరి నుండే నటన పుట్టింది కూడా. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. ఆస్కార్ అవార్డు కూడా మనకే సొంతం. అన్నీ ఉన్నాయి కానీ,ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ టాలీవుడ్ ప్రస్థానం లో ఒక్కరి స్టార్ హీరో కి కూడా నేషనల్ అవార్డు రాలేదే అనే వెలతి ఉండేది.
ఆ వెలతి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ద్వారా తీరిపోయింది. పుష్ప సినిమా తో ఆయన పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏ రేంజ్ లో షేక్ చేసాడో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు వచ్చినట్టు కొంతకాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు.
నేడు ఢిల్లోలోని విగ్యాన్ భవన్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డి తో కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొన్నాడు. గవర్నర్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన నేషనల్ అవార్డు ని అందుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు ఎంతో గర్వపడుతున్నారు.
టాలీవుడ్ లో ఏ హీరో కి దక్కని అత్యున్నత పురస్కారం తమ అభిమాన హీరో కి దక్కినందుకు ఎంతో ఆనందం ఉంది అంటూ అల్లు అర్జున్ పై ప్రసంగాల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్ ‘ చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తుంది. పార్ట్ 1 తో ఈ స్థాయి అవార్డులు రివార్డులు దక్కించుకున్న అల్లు అర్జున్, పార్ట్ 2 తో ఏ రేంజ్ కి వెళ్ళబోతున్నాడో చూడాలి.