Allu Arha : అల్లు వార‌సురాలంటే అట్లుంట‌ది మ‌ల్లా.. అర్హ టాలెంట్ సూప‌ర‌బ్బా

- Advertisement -

Allu Arha : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ.. అల్లురామ‌లింగ‌య్య ఫ్యామిలీలో ఆయన వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నాడు. అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలో చాలా మంది సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్.. ఆర్య లాంటి సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

allu arha
allu arha

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాక్టర్, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో హీరోగా వీర లెవ‌ల్ లో భారీగా అభిమానుల‌ను, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆవిష‌యాన్ని మీడియా ద్వారా ఆయ‌న వెల్ల‌డించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే ప్రతిభ కనబర్చి ఇప్పటికే బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సందడి చేసింది.

- Advertisement -

అంతేకాకుండా అర్హకు సంబంధించిన పలు విషయాలను అల్లు అర్జున్, స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ చిన్నారికి ఇంత చిన్న వయసులోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్హ చదువులోనే కాదు నటనలోనూ, చెస్ ఆడటంలోనూ రాణిస్తున్నా, అయితే ఆమెలో మరో టాలెంట్ దాగి ఉందని అల్లు అర్జున్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మట్టితో బొమ్మలు వేయడంలో అల్లు అర్హ అద్భుతం అని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసింది. ఈ విషయాన్ని అల్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇలా తయారు చేసిన గణేశ విగ్రహం ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసి.. తాను అర్హ చేసింద‌ని చెప్పుకొచ్చాడు.

అయితే ఇది చూసిన వారంద‌రూ ఏంటీ ఇది చేసింది అల్లు అర్హ‌నా.. అంజ‌లి మూవీలో ఏదో అమాకంగా క‌నిపించే అర్హలో ఇంత టాలెంట్ ఉందా వావ్‌.. ఎంతైన అల్లు ఫ్యామిలో వార‌సులంతా టాలెంట్ వారే న‌బ్బో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత చిన్న వ‌య‌స్సులో గ‌ణేశ విగ్ర‌హం వేడం అనేది గ్రేట్ అంటున్నారు. ఎంత రిచ్ అయినా పిల్ల‌ల‌కు తెలుగు త‌నం, భ‌గ‌వంతులు, పూజ‌లు గురించి కూడా చెప్ప‌డం మంచి సంస్కారానికి అల్లు ఫ్యామిలిని ఒప్పుకోవ‌చ్చ‌బ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here