Allu Arjun : 69 వ నేషనల్ అవార్డ్స్ ప్రకటన నిన్న సాయంత్రం ఘనంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు దక్కింది. అంతే కాదు టాలీవుడ్ చరిత్ర లో మొట్టమొదటి నేషనల్ అవార్డు ని అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. దీంతో ఆయనకీ సినీ ప్రముఖుల దగ్గర నుండి రాజకీయ నాయకులూ వరకు ప్రతీ ఒక్కరు ట్విట్టర్ , ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు.
వారిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, చంద్ర బాబు నాయుడు , లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ప్రతీ ఒక్కరికి రిప్లై గా కృతఙ్ఞతలు తెలియచేసిన అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ కి మాత్రం కృతఙ్ఞతలు తెలియచెయ్యలేదు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు తీవ్రమైన ఆగ్రహం కలిగించేలా చేసింది.
దానికి తోడు సీఎం జగన్ కి అల్లు అర్జున్ ఎంతో వినయం ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలియచేయడం ఇంకా కోపం కలిగించేలా చేస్తుంది. ఎందుకంటే పుష్ప సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ లో అతి తక్కువ టికెట్ రేట్స్ ఇచ్చింది జగనే. అన్నీ ప్రాంతాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన పుష్ప సినిమా,ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం భారీ నష్టాలను అందుకొని ఫ్లాప్ గా నిలవడానికి కారణం కూడా జగనే, అలాంటి వ్యక్తికి సమాధానం ఇచ్చి, సొంత మామయ్య పవన్ కళ్యాణ్ కి రిప్లై ఇవ్వవా అంటూ అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్.
The Telugu Flag flies high at the 69th National Film Awards!
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2023
My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa.
Kudos and congratulations to @ssrajamouli garu and…
అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ హ్యాండిల్ ద్వారా విషెస్ రావడం వల్లే అల్లు అర్జున్ రిప్లై ఇవ్వలేకపోయాడని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హ్యాండిల్ నుండి విషెస్ వచ్చి ఉంటే కచ్చితంగా రిప్లై ఇచ్చేవాడని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. కనీసం ఈ రోజైన సోషల్ మీడియా లో జరుగుతున్నా ఈ నెగటివిటీ ని గమనించి అల్లు అర్జున్ రిప్లై ఇస్తాడో లేదో తెలియాలి.
Thank you soo much @ysjagan garu . It’s a great pleasure to see your msg . Thank you soo much for your heartfelt msg 🙏🏽
— Allu Arjun (@alluarjun) August 24, 2023