Ram Chanra – Allu Arjun : రామ్ చరణ్ ని పక్కకి నెట్టి అల్లు అర్జున్ కి ఓటేసిన చిరంజీవి.. మండిపడుతున్న మెగా ఫ్యాన్స్!

- Advertisement -

Ram Chanra – Allu Arjun : మన టాలీవుడ్ నుండి టాప్ 3 పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కచ్చితంగా ఉంటుంది. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ని కేవలం రెండు మూడు సినిమాలతోనే దక్కించుకున్నాడు. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే రామ్ చరణ్ చేసింది చాలా తక్కువ సినిమాలే. అందరికంటే జూనియర్ కూడా. అయితే అందరి కంటే ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కూడా ఆయనకే ఉన్నాయి. రంగస్థలం చిత్రంతో తనలోని అద్భుతమైన నటుడుని బయటపెట్టిన రామ్ చరణ్, #RRR చిత్రం తో తన అద్భుతమైన నటన ప్రతిభతో అవతార్ చిత్రాన్ని తెరకెక్కించిన జేమ్స్ కామెరాన్ చేత కూడా ప్రశంసలు అందుకున్నాడంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

academy: 'RRR' star Ram Charan attends actor's branch hosted by Academy of Motion Picture Arts & Sciences - The Economic Times

అయితే రామ్ చరణ్ కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటపడింది. అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా కథని తొలుత రామ్ చరణ్ తో చెయ్యాలని చిరంజీవి కి కథ వినిపించాడట ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు. అయితే రామ్ చరణ్ కి ఇప్పుడే సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, మా అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చేందుకు కథలు వింటున్నాడని, వాడికి ఈ కథ కరెక్ట్ గా సరిపోతుందని అల్లు అర్జున్ వద్దకి గంగోత్రి స్టోరీ ని పంపాడట.

- Advertisement -
Ram Chanra - Allu Arjun
Ram Chanra – Allu Arjun

చిరంజీవి తో పాటుగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ అందరికీ ఈ కథ నచ్చడం తో వెంటనే సెట్స్ మీదకి తీసుకెళ్లారు. ఫలితం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభమై మూడేళ్లు కావొస్తుంది. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.

cold war between chiranjeevi ram charan and allu arjun this is the proof ksr

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here