షూటింగ్ రాకపోతే నీ సంగతి చెప్తానంటూ.. పుష్ప యాక్టర్​కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంటర్నేషనల్​గానూ గుర్తింపు పొందాడు. అయితే అల్లు అర్జున్ ఎప్పుడూ సరదాగా..ఫన్నీగా.. జాలీగా కనిపిస్తూ ఉంటాడు. బన్నీని కోపంగా.. కానీ.. ఎమోషనల్​గా కానీ చూడ్డం చాలా అరుదు. అయితే తాజాగా మాత్రం బన్నీ ఓ వేదికపై ఓ వైపు ఎమోషనల్ అవుతూనే.. ఇంకోవైపు కాస్త కోపంగా కనిపించాడు. అయితే ఆ కోపం నిజమైన కోపం కాదండోయ్. తన తోటి నటుణ్ని కాస్త ఆటపట్టించడానికి అలా యాక్ట్ చేశాడంతే. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా..?

అల్లు అర్జున్
అల్లు అర్జున్

ఇండియన్ ఐడల్ అనే షో గురించి తెలుసు కదా. అదేనండి పాటల ప్రోగ్రామ్. హిందీలో ఫేమస్ అయిన ఈ కార్యక్రమాన్ని ఆహా ఓటీటీ.. తెలుగులో కూడా షురూ చేసింది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ రన్నింగ్ అవుతోంది. సీజన్ 1లోనే కాదు సీజన్ 2 కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సీజన్2 ఫైనల్​కు చేరింది. ఈ కార్యక్రమం ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ వచ్చాడు. కంటెస్టెంట్‌లతో సరదాగా గడిపి వారిలో జోష్‌ నింపాడు. తనకు సంబంధించిన సరదా విశేషాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ షోకు వచ్చిన మరో గెస్టు.. పుష్ప సినిమాలో తన కోస్టార్​పై బన్నీ ఫైర్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

kesava

‘పుష్ప’లో కేశవ్‌గా అలరించిన నటుడు జగదీశ్‌ తన సినిమా ప్రమోషన్‌ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాడు. అతడికి బన్నీ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ‘నువ్వు హీరోగా ‘సత్తి గాని రెండెకరాలు’ చేశావ్‌ కదా.. అని ‘పుష్ప2’లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయనని అంటే కుదరదు. నువ్వు మాకు కేశవే. త్వరగా షూటింగ్‌కు రా.. అందరూ ఎదురుచూస్తున్నారు’ అని చెప్పాడు.

- Advertisement -

అల్లు అరవింద్‌ గురించి బన్నీ మాట్లాడుతూ.. ‘నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. నాకు అన్నీ ఇచ్చి.. నాకు కనిపించే దేవుడు మా నాన్న.. ఆయనే నాకు దేవుడు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇది చూసి బన్నీకి తండ్రి అంటే ఎంత ప్రేమో అంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మరికొందరేమో.. దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. ఎంత గొప్ప హీరో అయినా.. తండ్రికి తనయుడే కదా.. ఆ మాత్రం ప్రేమ ఉండటం పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్‌ ఈ షోలో తన సీక్రెట్​ను బయటపెట్టాడు. తన మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ పేరును చెప్పాడు. కంటెస్టెంట్‌ శ్రుతి పాట పాడడం అయ్యాక.. ‘నీ పేరు అంటే నాకు ఎంతో ఇష్టం. నా మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ పేరు కూడా శ్రుతినే’ అని చెప్పాడు. ఇంతలో గీతామాధురి ‘గర్ల్‌ఫ్రెండ్‌ అంటే చిన్నప్పుడు ఒకటో తరగతిలోనా’ అని అనడంతో వేదికంతా నవ్వులతో నిండిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here