Desamuduru Re Release : ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వారం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉంది,ఈ సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన దేశముదురు చిత్రాన్ని ఏప్రిల్ ఆరవ తేదీన రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి.

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఆరెంజ్’ చిత్రం రీ రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆల్ టైం టాప్ 3 మూవీస్ లో ఒకటిగా నిలవడం తో దేశముదురు సినిమా కూడా అదే రేంజ్ లో క్లిక్ అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు. ఎందుకంటే ఈ సినిమాలో కూడా పాటలు ‘ఆరెంజ్‘ లాగానే అద్భుతంగా ఉంటాయి.

అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అభిమానుల అంచనాలకు ఏమాత్రం మ్యాచ్ చెయ్యడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ మరియు వైజాగ్ వంటి ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రెండు చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి.హైదరాబాద్ లో అయితే RTC క్రాస్ రోడ్స్ లో మినహా మిగిలిన అన్నీ ప్రాంతాలలో టికెట్స్ కదలడం లేదు, ఇక వైజాగ్ పరిస్థితి కూడా ఇంచు మించు ఇదే, కేవలం ఒక్క థియేటర్ మినహా మిగిలిన థియేటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి.

కారణం ఏంటో తెలియదు కానీ, రీ రిలీజ్ లలో అంచనాలను అందుకోలేకపోయిన సినిమా గా దేశముదురు నిలిచిపోతుందని అందరు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్స్ లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో పర్వాలేదు అనే రేంజ్ బుకింగ్స్ ఉన్నాయి, విడుదల రోజు కౌంటర్ బుకింగ్స్ ఉంటాయని, కచ్చితంగా హౌస్ ఫుల్స్ పడతాయనే నమ్మకం తో ఉన్నారు అభిమానులు, మరి వారి నమ్మకాలను ఈ సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి.