Allu Arjun క్యారవాన్ డ్రైవర్ నెల జీతం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కంటే రెండింతలు ఎక్కువనా?

- Advertisement -

Allu Arjun : సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. నెగ్గుకురావాలంటే చాలా కష్టపడాలి కానీ, ఒక్కసారి స్థిరపడిన తర్వాత జీవితమే మారిపోతుంది. డబ్బుల సంపాదన కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల వద్ద ఉద్యోగం సంపాదిస్తే కుటుంబం స్థిరపడిపోయినట్టే అని చెప్పొచ్చు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు, ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం సంపాదిస్తే చాలు, మా జీవితం స్థిరపడిపోతుంది అని అనుకుంటూ ఉంటారు.

Allu Arjun
Allu Arjun

దేవుడికి ప్రార్థనలు కూడా చేస్తారు, కానీ సినీ ఇండస్ట్రీ లో నిజాయితీగా పని చేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కంటే రెండింతలు సంపాదన ఉంటుంది అని నిరూపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లకు నెలకు వచ్చే జీతాలను చూస్తే అసూయపడక తప్పదు. అల్లు అర్జున్ క్యార వాన్ డ్రైవర్ ని చూస్తే ప్రస్తుతం అదే అనిపిస్తుంది. అతనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

Allu Arjun Driver

https://www.instagram.com/itstelugucinema/రీసెంట్ గా అల్లు అర్జున్ డ్రైవర్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నేను అల్లు అర్జున్ కి వీరాభిమానిని. నాలో ఉన్న నిజాయితీని చూసి అల్లు అర్జున్ గారు నాకు తన క్యార వాన్ డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాడు. అల్లు అర్జున్ స్టాఫ్ లో జాయిన్ అవ్వడం అంటే, ఆయన సొంత కుటుంబం లో చేరినట్టే లెక్క. అల్లు అర్జున్ గారు తన స్టాఫ్ మొత్తాన్ని తన సొంత కుటుంబ సభ్యులు లాగ భావిస్తారు. మాకు ఏ చిన్న కష్టమొచ్చినా అల్లు అర్జున్ గారు సహాయం చెయ్యడానికి ముందు ఉంటారు. క్యారవాన్ ని డ్రైవ్ చెయ్యడం అంత సులువైన విషయం కాదు. నేను కేవలం దీని కోసం రెండు నెలల పాటు పూణే లో ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు అల్లు అర్జున్ గారు నెలకు 2 లక్షల రూపాయిలు జీతం గా ఇస్తున్నారు’ అంటూ లక్ష్మణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here