Allu Arjun తన భార్యతో కలిసి ఎందుకు ఓటు వేయలేదో తెలుసా..!

- Advertisement -

Allu Arjun : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ వద్దకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కలిసి వచ్చారు. కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల కలిసి వచ్చి వెళ్లారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత కూడా అంతే… కలిసి వచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సైతం కలిసి వచ్చారు.

Allu Arjun
Allu Arjun

శ్రీకాంత్, ఊహ… ఇలా చెబుతూ వెళితే చాలా మంది స్టార్ కపుల్స్ ఎన్నికల్లో కలిసికట్టుగా వచ్చి ఓటు వేసి వెళ్లారు. అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ రెడ్డి విడివిడిగా ఓటు వేశారు. పోలింగ్ బూత్ దగ్గర వాళ్లిద్దరూ జంటగా కనిపించలేదు. వేర్వేరుగా వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఎందుకు? అంటే… బీఎస్ఎన్ఎల్ కేంద్రంలో అల్లు అర్జున్ ఓటు వేశారు. మరోవైపు స్నేహ రెడ్డి ఓటు ఎఫ్ఎన్‌సిసి (ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్)లో ఉంది. అందువల్ల, ఇద్దరూ విడి విడిగా ఓటు వేశారు. అయితే… వాళ్లిద్దరూ జంటగా వెళ్ళకపోవడం వల్ల కొంత మంది అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఎప్పుడూ జంటగా కనిపించే స్టార్ కపుల్ వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదీ సంగతి! గురువారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్… ఆ తర్వాత ట్వీట్ కూడా చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరో వైపు పోలింగ్ కేంద్రం వద్ద అభిమానికి అల్లు అర్జున్ ఇచ్చిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here