Pushpa 2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. రష్మిక ఎక్స్ ప్రెషన్స్ అదుర్స్

- Advertisement -

Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి పార్టుగా పుష్ప 2 రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను లెక్కల మాస్టారు సుకుమార్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇటీవల విడుదలైన చేసిన అల్లు అర్జున్ స్పెషల్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉంటుందో అర్థమవుతుంది. అలాగే ఇప్పటికే విడుదలైన అయిన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్, పోస్టర్స్ సినిమా మీద మరింత క్యూరియాసిటీని పెంచాయి.

Pushpa 2
Pushpa 2

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆ వీడియోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే.. కేశవా వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా.. ఆ పాటేందో చెప్పవా అని అడగగా.. రష్మిక నడుస్తూ.. సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. అంటూ పాటను హమ్ చేస్తూ పుష్పరాజ్ సిగ్నెచర్ స్టెప్ వేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రస్తుతం శరవేగంగా నెట్టింట్లో వైరలవుతుంది.


పుష్ప 2 నుంచి రెండో పాటను మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ బన్నీ, రష్మిక కపుల్ సాంగ్ అని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఆగస్ట్ 15న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనుసూయ, జగదీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here