Allu Arha : మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అల్లు అర్హ.. ఏకంగా గ్లోబల్​ స్టార్ హీరోతో సినిమా.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

- Advertisement -

Allu Arha : టాలీవుడ్, బాలీవుడ్, హాలివుడ్.. ఇలా ఏ సినిమా ఇండస్ట్రీ అయినా.. స్టార్ కిడ్స్ ఎంట్రీ సాధారణమే. ముఖ్యంగా ఇండియాలో అది చాలా నార్మల్. బాలీవుడ్​లో స్టార్ హీరోహీరోయిన్ల కూతుళ్లు ఇండస్ట్రీలోకి రావడం కామన్. కానీ టాలీవుడ్​లో ఇంకా ఆ ట్రెండ్ అంతగా మొదలవ్వలేదు. ఇప్పటి వరకు టాలీవుడ్​లో ఉన్న స్టార్ కిడ్స్ అంటే.. హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక, మెగా డాటర్ నిహారిక కొణిదెల మాత్రమే. అయితే ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఇటీవలే మహేశ్ బాబు కుమార్తె సితార కూడా తనకు సినిమా రంగం అంటే ఇష్టమని.. నటన అంటే ఇష్టమని చెప్పేసింది.

allu arha

దీనికి తన తల్లి నమ్రత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ.. సమంతతో కలిసి శాకుంతలం మూవీతో సిల్వన్ స్క్రీన్​పై ఎంట్రీ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు అర్హకు రెండో సినిమా ఆఫర్ వచ్చేసిందట. అది కూడా ఏకంగా గ్లోబల్ స్టార్ హీరో మూవీలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆ సినిమా ఏంటి..?

శాకుంతలం మూవీలో భరతుడి పాత్రలో నటించి.. తన ముద్దు ముద్దు డైలాగ్​లతో ఆకట్టుకున్న అర్హ ఇప్పుడు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘దేవర’లో కనిపించనుందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ జాన్వీకపూర్​ చిన్నప్పటి పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. అయితే తాజాగా మరో క్రేజీ న్యూస్​ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో అల్లు అర్హ నటించేందుకు అల్లు అర్జున్ ఓకే చెప్పేశాడట. వచ్చే నెలలో ఈ చిన్నారి పాత్రకు సంబంధించిన షూటింగ్ చేస్తారట.

- Advertisement -

ఇందులో అర్హ పాత్ర నిడివి 10 నిమిషాలు ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పది నిమిషాలకు గానూ అర్హకు రూ.20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్కో నిమిషానికి రెండు లక్షలు అన్నమాట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తెగ సంబుర పడిపోతున్నారు. ఇప్పటికే ‘శాకుంతలం’లో క్యూట్ డైలాగ్స్​తో ముద్దుముద్దుగా మాట్లాడిన అర్హ దేవరలో ఎలా చేస్తుందో చూడాలి అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు తాజాగా దేవర మూవీ టీమ్‌ ఐదో షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలిపింది. మరో రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానున్నట్లు చెప్పింది. దీనికోసం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సెట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. యాక్షన్‌ సన్నివేశాలు హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ నేతృత్వంలో జరుగనున్నట్లు తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here