‘Allu Aravind : సీతారామం’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్ని దోచేసింది. ఆ సినిమాలో ఆమె అందం , నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ప్రతీ హావభావం కూడా తన ముఖం నుండి మహానటి రేంజ్ లో అభినయించింది. ఈ సినిమాకి ముందు ఆమె బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది, అక్కడ ఆమెకి పెద్దగా సక్సెస్ రాలేదు.

కేవలం ఒక సీరియల్ హీరోయిన్ గా కెరీర్ ని ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ సినీ ప్రయాణం ఇలా ఇక్కడి వరకు చేరింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో శ్రీలీల తర్వాత మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఇదంతా పక్కన పెడితే ‘సీతారామం’ చిత్రం లో అద్భుతంగా నటించినందుకు గాను మృణాల్ ఠాకూర్ కి ఉత్తమ నటిగా సైమా అవార్డు దక్కింది.

ఈ అవార్డుని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకుంది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత ఆమె గురించి గొప్పగా మాట్లాడుతూ ‘మృణాల్ ఠాకూర్ కూడా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆశీర్వదిస్తాడు. గతం లో కూడా ఆయన ఇలాగే లావణ్య త్రిపాఠి ని ఆశీర్వదించాడు, ఆమె నేడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆయన మృణాల్ ఠాకూర్ ని కూడా అలాగే ఆశీర్వదించాడు.

అంటే ఆమె కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక హింట్ ఇచ్చేసాడు. గతం లో ఆయన లావణ్య త్రిపాఠి ని అలా ఆశీర్వదించినప్పుడు వరుణ్ తేజ్ – లావణ్య ఇద్దరూ కూడా డేటింగ్ లో ఉన్నారు. ఆ విషయం అల్లు అరవింద్ కి తెలుసు కాబట్టే అలా ఆశీర్వదించాడు. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ విషయం లో కూడా అంతే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ చాలా కాలం నుండి అల్లు శిరీష్ తో ప్రేమాయణం నడుపుతుందని, ఈ విషయం అల్లు అరవింద్ కి కూడా తెలుసు అని , త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.