కోట్ల ఆస్తులున్నా కాసుల కోసం కక్కుర్తి పడుతున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లకు డబ్బంటే చాలా పిచ్చి. ఎక్కువ డబ్బులు వస్తాయంటే ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధపడుతారు. లిమిట్స్ క్రాస్ చేసి ఎలాంటి పనులైనా చేస్తామంటారు. కేవలం ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్లే కాదు.. ఇండస్ట్రీలోకి తాతల పేర్లు నాన్నల పేర్లు చెప్పుకుని వచ్చిన వాళ్లు కూడా అదే విధంగా ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అదే లిస్టులోకి జాయిన్ అయింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. ప్రస్తుతం ఇదే విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ప్రముఖ నిర్మాత మహేష్ భట్, నటి సోనీ రంజనాథ్ దంపతుల కుమార్తె అయిన అలియా భట్ ..‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. అప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా ఏలేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా అమ్మడికి ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా వరించింది. ఈ క్రమంలోనే ఆలియా పై అందరి ఫోకస్ పెరిగింది. అసలు ఈ ఆలియా భట్ ఎవరు.. తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు ప్రేక్షకులు.

Alia Bhatt
Alia Bhatt

ప్రస్తుత బాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది ఆలియా. ఆమె ఒక్కొక్క సినిమాకు దాదాపు రూ. 7 నుంచి 8 కోట్లు చార్జ్ చేస్తుందట. అంతేకాదు అలియా భట్ నికర ఆస్తుల విలువ దాదాపు 600 కోట్లకు పైగానే అంటూ సమాచారం. కాగా ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ అనే ప్రొడక్షన్ హౌస్ ను ఆమె నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ నెలకు కోట్లలో సంపాదిస్తుంది. తన సొంత దుస్తుల బ్రాండ్ నుంచి కూడా ఆమెకు భారీ లాభాలు వస్తు్న్నాయి. ఏడాది కింద‌టే ఈ సంస్థ రూ. 150 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ లో పెరిగిన అలియా భట్ డబ్బు విషయంలో మాత్రం చాలా పిసినారని టాక్. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనుకునే మనస్తత్వం ఆలియాదని టాక్. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here