Alia Bhatt : వామ్మో.. అలియాభట్ వేసుకున్న నెక్లెస్ డబ్బులతో చిన్నవి 4సినిమాలు తీసేయొచ్చు

- Advertisement -

Alia Bhatt : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలలో అలియా భట్ ఫ్యామిలీ ఒకటి. ఈమె ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనతి కాలంలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో.. అలాగే హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటుంది ఈ చిన్నది. అలియా భట్ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. అలియా భట్ గత ఏడాది వివాహం చేసుకొని బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాపా ఆలనపాలన చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన అలియాభట్ ధరించిన నెక్లెస్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ వస్తువులను వాడేందుకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి.. తాజాగా అలియాభట్ మెడలో వేసుకున్న ఆ నెక్లెస్ ఖరీదుతో దాదాపు 4చిన్న బడ్జెట్ సినిమాలను తీసేయొచ్చు. అలియాభట్ ఇటీవల లండన్ లో సలాం బాంబే ఫౌండేషన్ నిర్వహించిన హోప్ గాలా అనే ఈవెంట్ లో పాల్గొంది. ఆ ఈవెంట్ లో చాలా సింపుల్ గా కనిపించింది. కానీ మెడలో మాత్రం జిగేల్ మనే నెక్లెస్ ధరించింది. దాన్ని చూసిన నెటిజన్లు గూగుల్ లో వెతకడం ప్రారంభించారు.

- Advertisement -

ఆ నెక్లెస్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా.. దాని ధర మాత్రం కోట్లలో ఉంది. అలియా భట్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లెస్ ధర దాదాపు రూ.20 కోట్లు ఉంటుందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి రూ.20 కోట్లా అని షాక్ అవుతున్నారు.. ఏది ఏమైనా ఈ నెక్లెస్ మాత్రం చాలా బాగుందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఇటీవల తన కూతురు కోసం ఖరీదైన బంగ్లాను కూడా కట్టించారు. దాని ధర ఏకంగా రూ. 250 కోట్లకు పైగా ఉంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here