మెట్ గాలాలో ఆలియా భట్ .. ముత్యాల గౌనులో యువరాణిలా మెస్మరైజ్ చేసిన బ్యూటీ

- Advertisement -

ఆలియా భట్ బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. తొలి సినిమాలో తన గ్లామర్, క్యూట్ నెస్ తో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత హైవే అనే సినిమాతో ఎవరూ చేయలేని సాహసం చేసింది. ఆ సినిమాతో ఆలియాలో ఉన్న టాలెంట్ ను బీ టౌన్ గుర్తించింది. నెపో కిడ్ అయినా ఈ బ్యూటీలో టాలెంట్ ఉందని అర్థం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఆలియా వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఆలియా కేవలం గ్లామర్ పాత్రలే కాదు కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రల్లోనూ నటించి తన సత్తా చాటింది. 

ఆలియా భట్
ఆలియా భట్

హైవే, ఉడ్తా పంజాబ్, డార్లింగ్స్, రాజీ, గంగూబాయి కాఠియావాడి వంటి సినిమాలతో తనలోని అసలైన నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆలియా. ఇక బీ టౌన్ లో కంప్లీట్ స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఇటీవలే ఈ బ్యూటీ ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సీత పాత్రలో అలరించింది. కనిపించింది కాసేపే అయినా ఈ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ భామ తన కెరీర్ లో ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను కూడా అందుకుంది.

తాజాగా ఈ బ్యూటీ అత్యంత ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొంది. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెట్ గాలాలో సందడి చేసింది. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, రిలయన్స్ జియో యాజమానురాలు ఈషా అంబానీతో కలిసి మెట్ గాలాలో సందడి చేసింది. ఆలియా భట్ మెట్ గాలాలో వైట్ కలర్ గౌనులో సందడి చేసింది. లక్ష ముత్యాలు పొదిగిన గౌనులో ఈ బ్యూటీ యువరాణిలా కనిపించింది. 

- Advertisement -

ఈ ఫొటోలను ఆలియా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆలియా ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ గౌనులో ఆలియా ఏంజిల్ లా ఉందని నెటిజన్లు అంటున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here