Naga Chaitanya Sobhita Dhulipala : నిన్న రాత్రి నుండి అకస్మాత్తుగా నాగ చైతన్య రెండవ వివాహం గురించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత కొంతకాలంగా నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడని, ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ టాక్ వినిపించింది. కానీ అవి రూమర్స్ మాత్రమే అని అభిమానులు కొట్టి పారేసారు. కానీ అవి రూమర్స్ కాదని, నిజమేనని ఈరోజు తేలింది. కాసేపటి క్రితమే వీళ్లిద్దరు నాగార్జున గెస్ట్ హౌస్ లో గ్రాండ్ గా, ఎంతో వైభోగంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలను కాసేపటి క్రితమే ట్విట్టర్ లో అక్కినేని నాగార్జున పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు నా పెద్ద కొడుకు నాగ చైతన్య మరియు శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్న విషయాన్నీ మీకు చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాను. శోభిత ని మా కుటుంబం లో ఆహ్వానించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా వీళ్లిద్దరికీ శుభాకాంక్షురాలు తెలియచేస్తున్నాను. వీళ్లిద్దరికీ ఆ దేవుడు జీవితకాలం సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ వేసాడు.చాలా కాలం నుండి వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, నాగ చైతన్య, శోభిత పలు సందర్భాలలో పరోక్షంగా వాటిని ఖండించారు. కానీ వరుణ్ తేజ్ – లావణ్య జంట లాగానే చివరి వరకు గోప్యంగా ఉంచి, ఒక్కసారిగా ఇలా ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్టు ఇచ్చారు.
అయితే నాగ చైతన్య రెండవ పెళ్లి పై సోషల్ మీడియా లో బిన్నాభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎలాంటి రిలేషన్ ఎవరితో కూడా పెట్టుకోలేదు కానీ, నాగ చైతన్య మాత్రం విడిపోయిన రెండు నెలలకే శోభిత తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఒక విధంగా సమంత , నాగ చైతన్య విడిపోవడానికి శోభితనే కారణం అని అంటున్నారు ఇండస్ట్రీ కి చెందిన ముఖ్యులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024