Akkineni Nagarjuna : టాలీవుడ్ లో నవ మన్మదుడిగా, మోస్ట్ రొమాంటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న స్టార్ అక్కినేని నాగార్జున.ప్రస్తుతం ఆయన వయస్సు 60 ఏళ్ళు దాటింది.కానీ ఇప్పటికీ కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చే గ్లామర్ అతని సొంతం.అసలు ఈ వయస్సులో ఇంత చార్మ్, ఇంత అందం ఎలా సాధ్యమని, అసలు ఎలా మైంటైన్ చేస్తున్నారు అంటూ నాగార్జున ని ఎన్నో ఇంటర్వ్యూస్ లో అడిగారు కూడా.దానికి ఆయన చెప్పే సమాధానం ఒక్కటే.

మనసు ప్రశాంతం గా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు వ్యాయామం చెయ్యడం.ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తాను కాబట్టే తానూ ఇప్పటికీ ఇలా గ్లామర్ మైంటైన్ చెయ్యగల్తున్నాను అంటూ అనేక సందర్భాలలో ఆయన చెప్పాడు.రీసెంట్ గా గెడ్డం లుక్ తో కనిపిస్తూ ఒక నలభై ఏళ్ళు వెనక్కి వెళ్లిన వాడిగా కనిపిస్తున్న నాగార్జున లుక్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ లుక్ తాను త్వరలో చెయ్యబోతున్న సినిమా కోసమే అని తెలుస్తుంది.ప్రముఖ రచయితా ప్రసన్న కుమార్ దర్శకుడిగా మారి నాగార్జున తో త్వరలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఇది నాగార్జున 99 వ చిత్రం గా తెరకెక్కబోతుంది.రైటర్ గా ధమాకా వంటి గ్రాండ్ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న ప్రసన్న, నాగార్జున తో చెయ్యబోతున్న ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ మానసా వారణాసి నటించబోతుందని సమాచారం.

మానసా వారణాసి వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే.బహుశా నాగార్జున లుక్స్ ప్రస్తుతం కుర్రాడిగానే ఉండొచ్చు, కానీ 60 ఏళ్ళ వయస్సు దాటిన హీరో అంత కుర్ర హీరోయిన్ తో కలిసి నటిస్తే సోషల్ మీడియా ట్రోల్ల్స్ మామూలు రేంజ్ లో ఉండవని, ఇది వరకే ధమాకా చిత్రం లో రవితేజ – శ్రీలీల కాంబినేషన్ పై సోషల్ మీడియా లో చాలా ట్రోల్ల్స్ వచ్చాయి.ఇక నాగార్జున – మానస వారణాసి కాంబినేషన్ పై ఇంకెన్ని ట్రోల్ల్స్ వస్తాయో చూడాలి.
