Akkineni Nagarjuna : ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ 7 ఎంత అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుందో మన అందరికీ తెలిసిందే. ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ప్రతీ వారం థ్రిల్ కి గురి చేస్తూనే ఉంది. ఈ వారం కొత్తగా 5 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ ఈవెంట్ ఆదివారం రోజు సాయంత్రం 7 గంటల నుండి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం.

ఇక ఈ ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున ఎంతో అందంగా కనిపించాడు. రంగుల చొక్కా వేసుకొచ్చి ఆరోజు అందరినీ డామినేట్ చేసేసాడు. ఇదే ఎపిసోడ్ లో మాస్ మహారాజ రవితేజ మరియు లవర్ బాయ్ సిద్దార్థ్ పాల్గొన్నారు. వాళ్లిద్దరూ కూడా ఆరోజు నాగ్ డ్రెస్సింగ్ స్టైల్ ని మరియు ఆయన అందం ని డామినేట్ చేయలేకపోయారు.

ఇది ఇలా ఉండగా ఈ ఎపిసోడ్ లో నాగార్జున వేసుకున్న చొక్కా మీద అభిమానుల ద్రుష్టి పడింది. అభిమాన హీరో ఏది చేస్తే అది చెయ్యాలని చూసే మనస్తత్వం ఉండే ఫ్యాన్స్ , ఈ చొక్కా ని కొనుగోలు చెయ్యడానికి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆ చొక్కా ధర చూసి ఫ్యాన్స్ కళ్ళు బైర్లు కమ్మాయి. అన్నీ ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉన్న ఈ చొక్కా ధర 2 లక్షల 22 వేల రూపాయిలు అట.

ఇంత డబ్బులు ఒక మధ్య తరగతి కుటుంబానికి దొరికితే , సిటీ లో రెండు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతం గా గడిపేయొచ్చు. సామాన్యులు అయితే ఈ చొక్కాని కొనలేరు. అది అసాధ్యం, కానీ నాగార్జున రేంజ్ ధనవంతులు కాకపోయినా, కోట్ల రూపాయిల ఆస్తులు గలిగిన సంపన్న అభిమానులు ఎవరైనా ఉంటే ఈ చొక్కాని కళ్ళు మూసుకొని కొనేయొచ్చు.