అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఫ్యాన్స్ కి ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిలించింది అనే చెప్పాలి.అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా కోసం తన రెండేళ్ల విలువైన సమయాన్ని కేటాయించి, కేవలం డైరెక్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాడు.ఈ రెండేళ్ల సమయం లో ఆయన రెండు మామూలు కమర్షియల్ సినిమాలు చేసి ఉన్న హిట్ తగిలేదేమో.
కానీ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం అనేలోపు ఆయన ఈ సినిమాతో తన కెరీర్ యూ టర్న్ తీసుకుంటుంది అని బలంగా నమ్మి ఈ చిత్రాన్ని చేసాడు.అప్పట్లో ఈ సినిమా ప్రారంభం అయ్యినప్పుడు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 75 కోట్ల రూపాయిల రేంజ్ వేల్యూ ఉండేది.కానీ కరోనా వచ్చి సినిమా మాటికొస్తే వాయిదా పడుతూ రావడం తో 37 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం కేవలం 6.50 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది, నిన్నటితో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ థియేటర్స్ లో రన్ క్లోజ్ అయ్యింది.అంటే బయ్యర్స్ కి 30 కోట్ల రూపాయలకు పైగా నష్టం అన్నమాట, అందరూ తీవ్రంగా నష్టపోవడం తో బయ్యర్స్ నిర్మాతని నష్టపరిహారం చెల్లించాల్సిందిగా వత్తిడి చేస్తున్నారట.
ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అఖిల్ ,ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ లో 75 శాతం తిరిగి నిర్మాతకి ఇచేసినట్టు తెలుస్తుంది.ఈ చిత్రానికి ఆయన సుమారుగా 15 నుండి 20 కోట్ల రూపాయిల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్.ఇది కేవలం నిర్మాత మరియు డైరెక్టర్ మధ్య ఏర్పడిన గొడవల కారణంగానే అలాంటి ఔట్పుట్ వచ్చిందనే విషయం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, అయినా కూడా చిన్న వయస్సు లో డిస్ట్రిబ్యూటర్స్ జీవితాలను దృష్టిలో పెట్టుకొని అఖిల్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం.