Akhil Akkineni : అక్కినేని వారసుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని అఖిల్ ఎప్పుడో వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ నిశ్చితార్థం చేసుకొని మరీ.. కొన్ని సమస్యల వల్ల పెళ్లి జరగలేదు. అప్పటినుంచి నిఖిల్ ఎప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.. అంతేకాదు నిన్నటికి నిన్న క్రికెట్ గ్రౌండ్లో అఖిల్ ని చూసి ఒక హీరోయిన్ పడిపోయిందని త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకుంటారంటూ వార్తలు వినిపించాయి.. అయితే అందులోను నిజం లేకపోయింది. అయితే ఇప్పుడు ఒక సందర్భంలో అఖిల్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేయడం వైరల్ గా మారుతుంది.

ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకపోతే అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సొంతం చేసుకోవాల్సి ఉంది ఈ సినిమా కోసం ఏకంగా రూ.80 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సీసీఎల్ కోసం అఖిల్ ప్రాక్టీస్ చేస్తుండగా అఖిల్ వెల్లడించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అఖిల్ మాట్లాడుతూ సీసీఎల్ లో నాతో పాటు పాల్గొనే వాళ్లు నాకు స్నేహితులుగా ఉంటారు . స్కూల్లో క్లాసులకు వెళ్లకుండా క్రికెట్ ఆడుతూ చాలా సార్లు దొరికామని.. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమని.. క్రికెట్ ఆడుతూ కిటికీల అద్దాలు పగలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.
అలాగే పెళ్లి గురించి మాట్లాడితే.. పెళ్లి చూసుకునే ఆలోచన లేదని.. సింగిల్ గా ఉన్న తనకు ఇప్పట్లో మింగిల్ అయ్యే ఆలోచన లేదని తెలిపారు. నేను ప్రేమించేది ఒక స్పోర్ట్స్ ను మాత్రమేనని తెలిపారు. ఇకపోతే అఖిల్ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించట్లేదని స్పష్టం అవుతోంది.