బిగ్ బాస్7లో ఇటీవల జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో అమర్ దీప్, ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వివాదం. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడుకుంటూ సింపథీ క్రియేట్ చేసుకుంటున్నావంటూ రతిక కూడ రివర్స్ అయి మాట్లాడింది. హౌస్ లోకి వచ్చినప్పుడు ప్రశాంత్ తరఫున మాట్లాడిన రతిక నామినేషన్స్ లో తన అసలు రంగు బయట పెట్టిందని అంటున్నారు. ఈ గొడవపై బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ స్పందించాడు.
“పల్లవి ప్రశాంత్ నామినేషన్ చూస్తే చాలా బాధగా అనిపించింది. రా, రేయ్ అంటూ కొంతమంది ప్రశాంత్ గురించి వల్గర్ గా మాట్లాడారు. కానీ తను మాత్రం అక్క, అన్న, చెల్లి అంటూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ తన వాయిస్ వినిపించేందుకు ట్రై చేస్తుంటే ఆపేశారు. అదే పొజిషన్ లో శివాజీ ఉంటే ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ప్రశాంత్ కాబట్టి ఈజీగా తీసుకున్నారు. వీడియోస్ లో అతను బతిమలాడుకున్నాడని అంటున్నారు. అందరికీ తెలిసిందే అవును కానీ దాన్ని రిమైండ్ చేస్తూ అడుక్కుని వచ్చావని అనడం చాలా బ్యాడ్. అతను గేమ్ ఆడటానికి వచ్చాడు. ఒకర్ని అడిగేటప్పుడు చేతులు జోడించి అడుగుతారు. అదే చేస్తున్నాడు గేమ్ కోసం ఆడుతున్నాడు అన్నీ ఎమోషన్స్ చూపిస్తున్నాడు.
అందులో తప్పేముంది. రతిక మొదట వచ్చినప్పుడు ఎలా ఉంది.. నామినేషన్స్ టైమ్ లో తను పూర్తిగా ఛేంజ్ అయిపోయింది. ప్రశాంత్ బిగ్ బాస్ గేట్ దగ్గర కూర్చున్నానని చెప్పినప్పుడు తనకి ఎంతో సపోర్ట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి ఏం చేశావ్ అన్నట్టు మాట్లాడింది. నువ్వేం దిగులు పడకు ప్రశాంత్” అని ధైర్యం చెప్తూ వీడియోలో మాట్లాడాడు. ‘జై జవాన్.. జై కిసాన్’ తను ఎక్కడి నుంచి వచ్చాడనే విషయం మర్చిపోలేదు. అందరూ అతడిని గౌరవించండి అంటూ అఖిల్ సార్థక్ వీడియో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ వీడియోపై కూడా నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.