Akhil : ‘ఐ లవ్ యూ’ అంటూ ఆ హీరోయిన్ వెంటపడుతున్న హీరో అఖిల్

- Advertisement -

Akhil : ఏంటి అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా ఇదే టాపిక్ మీద చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మిగతా హీరోలు అందరూ సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్నారు.. కానీ, నాగచైతన్య – అఖిల్ కెరియర్ పరంగా సరైన హిట్ అందుకోలేకపోతున్నారని ఓ రేంజ్ లో ఆకతాయిలు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

నాగార్జున వరుస సినిమాల్లో నటిస్తూ హిట్లు కొడుతున్నాడు.. కానీ వాళ్ళ కొడుకులు మాత్రం హిట్ ట్రాక్ ఎక్కలేకపోతున్నారు కౌంటర్స్ వేశారు . అయితే అలాంటివి పెద్దగా పట్టించుకోని అక్కినేని ఫ్యామిలీ ఎవరి పని వాళ్లది అన్నట్లు వెళ్లిపోతున్నారు. నాగార్జున తన 100వ సినిమా కోసం డైరెక్టర్ ను వెతికే పనిలో పడ్డాడు. నాగచైతన్య తన తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అయితే హీరోగా ఉన్న అఖిల్ మాత్రం ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమాయణం కొనసాగిస్తున్నాడన్న వార్త వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవుదాం అంటూ చూస్తున్న అఖిల్ తో ఈ బ్యూటీ గతంలో ఓ సినిమా కూడా చేసింది.

- Advertisement -
అక్కినేని అఖిల్
అక్కినేని అఖిల్

అయితే ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. అయినా సరే వీళ్ల కాంబో మాత్రం బాగా జనాలకు నచ్చేసింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. మంచి లవ్ స్టోరీ తో యూత్ ను ఆకర్షించాడు. అఖిల్ ఆ హీరోయిన్ తో చాలా డీప్ గా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని అఖిల్ దగ్గరికి ఫ్రెండ్స్ ద్వారా.. ఓ న్యూస్ మీడియాకు లీకై వైరల్ అయింది. అఖిల్ ఆ హీరోయిన్ ని పిచ్చగా ప్రేమిస్తున్నాడు అని ఆ విషయం సమంతకి కూడా తెలుసునని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ హీరోయిన్ ప్రజెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది. అన్ని సక్రమంగా జరిగితే ఆమె అక్కినేని ఇంటికి కోడలు అవుతుందని ఫ్యాన్స్ కూడా అఖిల్ కు సపోర్ట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here